ముంబైలోనే ‘లైగర్’.. డైరెక్టర్ మనసంతా అక్కడేనంటా.. త్వరలో స్టార్ట్ కానున్న షూటింగ్..

'ఇస్మార్ట్ శంకర్' వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం 'లైగర్'. ఇందులో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ

ముంబైలోనే 'లైగర్'.. డైరెక్టర్ మనసంతా అక్కడేనంటా.. త్వరలో స్టార్ట్ కానున్న షూటింగ్..
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 27, 2021 | 8:23 AM

‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘లైగర్’. ఇందులో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను చార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఇటీవల విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‏కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచానాలు భారీగానే పెరిగాయి.

ఈ సినిమాను దాదాపు రూ.120 కోట్ల భారీ బడ్జెట్‎తో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇదిలా ఉండగా.. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్‏ను మళ్లీ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. అయితే ఈ సినిమా చిత్రీకరణ మొత్తం ముంబైలో తీయాల్సి ఉంది. కానీ అక్కడ కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఆ ప్రయత్నాన్ని మానుకున్నారట చిత్రయూనిట్. అయితే హైదరాబాద్‏లో ముంబై సెట్ వేసి షూటింగ్ చేయాలని భావించారట… కానీ డైరెక్టర్ పూరీ ముంభైలోనే తీయాలని ఫిక్స్ కావడంతో ఆ ప్రయత్నాన్ని మానుకున్నారట మూవీ టీం. ఇక లైగర్ మూవీ మొత్తం ముంబై బ్యాక్‏డ్రాప్‏లో సాగనుంది. దీంతో ఆలస్యం అయినా షూటింగ్ మాత్రం ముంబైలోనే చేయాలని భావిస్తున్నారట చిత్రయూనిట్. ఇక వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

Also Read:

బంపర్ ఆఫర్ కొట్టేసిన గద్దలకొండ గణేష్ హీరోయిన్.. బాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న డింపుల్ ?