zombie reddy movie: బాలీవుడ్‌లోకి హీరో తేజ సినిమా ? భారీ ధరకు ‘జాంబీరెడ్డి’ హిందీ రైట్స్..
'విస్మయం' ఫేం ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో రాబోతున్న థ్రిల్లర్ సినిమా టజాంబీ రెడ్డిట. తెలుగులో తొలి జోంబీ సినిమా. ఇందులో బాలనటుడిగా పలు చిత్రాల్లో
‘విస్మయం’ ఫేం ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో రాబోతున్న థ్రిల్లర్ సినిమా టజాంబీ రెడ్డిట. తెలుగులో తొలి జోంబీ సినిమా. ఇందులో బాలనటుడిగా పలు చిత్రాల్లో కనిపించనున్న తేజ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అక్కినేని సమంత నటించిన ‘ఓ బేబీ’ సినిమాలో కీలకపాత్రలో నటించాడు తేజ. ఈ సినిమాను యాపిల్ స్టూడియోస్ బ్యానర్ పై రాజశేఖర్ వర్మ నిర్మిస్తున్నారు. వాస్తవ సంఘటనల హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.
ఈ సినిమాలో తేజ సజ్జ, ఆనంది, దక్ష నగార్కర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదైలన ఈ సినిమా టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ హిందీ రైట్స్ రూ.2.2 కోట్లకు అమ్ముడుపోయినట్లుగా టాక్ వినిపిస్తోంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో వస్తున్న తొలి చిత్రం జాంబీరెడ్డి. లాక్ డౌన్ తర్వాత ప్రభుత్వ నిబంధనలతో షూటింగ్ స్టార్ట్ చేసి.. త్వరగా పూర్తిచేసాం. మా సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుందని నిర్మాత రాజశేఖర్ తెలిపారు. ఇక ఈ చిత్రం ఫిబ్రవరి 5న విడుదల కానుట్లుగా సమాచారం.
Also Read:
Uppena Movie : సముద్రం సాక్షిగా మొదలైన ఓ ప్రేమ కథ.. ఉప్పెన రిలీజ్ డేట్ వచ్చేసింది..