AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun : శరవేగంగా సుకుమార్ సినిమా షూటింగ్.. ‘పుష్ప’ కోసం బన్నీకి భారీగానే ముట్టజెపుతున్నారట..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న తాజాగా చిత్రం పుష్ప. టాప్ డైరెక్టర్  సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

Allu Arjun : శరవేగంగా సుకుమార్ సినిమా షూటింగ్.. 'పుష్ప' కోసం బన్నీకి భారీగానే ముట్టజెపుతున్నారట..
Rajeev Rayala
|

Updated on: Jan 27, 2021 | 8:31 AM

Share

Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న తాజాగా చిత్రం పుష్ప. టాప్ డైరెక్టర్  సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాగంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో లక్కీ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ యుర్నేని, రవిశంకర్ వై నిర్మిస్తున్నారు.

కొన్ని రోజుల క్రితం మారేడుపల్లి ఏజెన్సీ ప్రాంతంలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ మూవీలో రామ్ లక్ష్మణ్ పీటర్ హెయిన్స్ సారథ్యంలో రెండు యాక్షన్ ఎపిసోడ్స్, ఓ సాంగ్ షూటింగ్ పూర్తైంది. తర్వాత కొవిడ్ నేపథ్యంలో ఈ చిత్ర షూటింగ్‏కు బ్రేక్ పడింది. ఇటీవలే తిరిగి షూటింగ్ ప్రారంభమైంది. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం కొంతమంది బాలీవుడ్ నటులనుకూడా తీసుకోనున్నారని తెలుస్తుంది. కాగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది.ఈ సినిమా కోసం బన్నీ భారీగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాకోసం బన్నీకి 20 కోట్లకి పైగా పారితోషికం ముట్టజెపుతున్నారన్నది టాక్. ఇక ఈ సినిమాలో మునుపెన్నడూ కనిపించని లుక్ లో కనిపించబోతున్నాడు అల్లు అర్జున్. ఊర మాస్ గెటప్ లో బన్నీ లుక్ ఉండనుంది. ఆ మధ్య విడుదలైన పోస్టర్లు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇక శరవేగంగా ఈ సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు మేకర్స్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ముంబైలోనే ‘లైగర్’.. డైరెక్టర్ మనసంతా అక్కడేనంటా.. త్వరలో స్టార్ట్ కానున్న షూటింగ్..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!