గ్రాఫిక్స్…కేరాఫ్ కోడి రామకృష్ణ

గ్రాఫిక్స్...కేరాఫ్ కోడి రామకృష్ణ

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ లేరనే వార్తను జీర్ణించుకోవడమే చాలా కష్టంగా ఉంది. ఆయన తీయని సినిమా జోనర్ లేదంటే అతిశయోక్తి కాదేమో. అయితే పాంటసీ సినిమాలకు కోడికృష్ణ పెట్టింది పేరు. గ్రాఫిక్స్ అంటే ఆమడ దూరంలో ఉన్న రోజుల్లోనే అమ్మోరు, దేవి లాంటి గ్రాఫిక్ ఓరియంటడ్ మూవీస్ తీసి సెన్సేషన్ క్రియేట్ చేశారు కోడి రామకృష్ణ. అంతేకాదు అత్యంత భారీ స్థాయిలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆయన తీసిన అంజి సినిమా సౌత్ ఇండియన్ మూవీస్‌లో గ్రాఫిక్స్‌కి […]

Ram Naramaneni

|

Feb 22, 2019 | 4:36 PM

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ లేరనే వార్తను జీర్ణించుకోవడమే చాలా కష్టంగా ఉంది. ఆయన తీయని సినిమా జోనర్ లేదంటే అతిశయోక్తి కాదేమో. అయితే పాంటసీ సినిమాలకు కోడికృష్ణ పెట్టింది పేరు. గ్రాఫిక్స్ అంటే ఆమడ దూరంలో ఉన్న రోజుల్లోనే అమ్మోరు, దేవి లాంటి గ్రాఫిక్ ఓరియంటడ్ మూవీస్ తీసి సెన్సేషన్ క్రియేట్ చేశారు కోడి రామకృష్ణ. అంతేకాదు అత్యంత భారీ స్థాయిలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆయన తీసిన అంజి సినిమా సౌత్ ఇండియన్ మూవీస్‌లో గ్రాఫిక్స్‌కి నభూతో నభవిష్యతి అని చెప్పాలి. ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి చాలా సంవత్సరాలు కష్టపడి ఆయన ఈ సినిమాకు చేసిన కష్టానికి గుర్తింపు లభించింది. అంజి మూవీకి విజువల్ ఎఫెక్ట్స్ క్యాటగిరిలో నేషనల్ అవార్డు అందుకుంది. విజువల్ ఎఫెక్ట్స్ క్యాటగిరిలో నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు ఫిలింగా అంజి నిలిచిదంటే ఆ మూవీ స్థాయేంటో అర్ధం చేసుకోవచ్చు.

కోడి రామకృష్ణ  తీసే సినిమాలు ఇతర భాషల్లోనూ విడుదల అవుతుంటాయి. ఆయన దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. అంతేకాదు.. దివికేగిన ప్రముఖ కన్నడ నటుడు విష్ణువర్ధన్‌ను గ్రాఫిక్స్‌ ద్వారా వెండితెరపై పునః సృష్టించిన తొలి దర్శకుడు ఆయనే కావడం విశేషం. ‘నాగభరణం’(కన్నడలో నాగహారవు) సినిమాలో ఆయన ఈ అద్భుతాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

ఏ సినిమా అయినా గ్రాఫిక్స్‌ లేకుండా కూడా తీయొచ్చనేది కోడి రామకృష్ణ అభిప్రాయం. ప్రేక్షకులను సంతృప్తి పరచాలంటే అధునాతన పద్ధతుల్లో సినిమా తీయాలనేవారు. ‘నా దృష్టిలో విజువల్‌ ఎఫెక్ట్స్‌ అనేది ఇంగ్లిష్ భావోద్వేగం. దానికి మనదైన వాతావరణంతో కూడిన ఓ కథ కావాలి. సాంకేతికత పెరిగిందంటే అది నిర్మాతకి లాభం తెచ్చిపెట్టేదిగా ఉండాలి. అలాగని సాంకేతికత ఉంది కదా అని బద్ధకం పనికి రాదు. విజువల్‌ ఎఫెక్ట్స్‌లో దర్శక నిర్మాతలకు అవగాహన తప్పనిసరి’ అని ఒకానొక సందర్భంలో వెల్లడించారు కోడి రామకృష్ణ.

నిర్మాత లేని సెట్‌ దేవుడు లేని గుడిలాంటిది అంటుండేవారు కోడి రామకృష్ణ. ఆయన ఏదన్నా సినిమాను తెరకెక్కిస్తున్నారంటే ఆ సెట్‌లో నిర్మాత కచ్చితంగా ఉండి తీరాల్సిందే. నిర్మాతలు కోరుకునే సినిమాలే తీసేవారు. ఆయన కెరీర్‌లో వందకుపైగా సినిమాలున్నాయంటే అందుకు నిర్మాతలే కారణమని చెబుతుండేవారాయన. వి మిస్ యూ కోడి రామకృష్ణ గారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu