హిందీలో రీమేక్ కానున్న తమిళ క్లాసిక్..!

హిందీలో రీమేక్ కానున్న తమిళ క్లాసిక్..!

తమిళ హీరోలు విక్రమ్, సూర్య కలిసి నటించిన చిత్రం ‘పితామగన్’. ఈ సినిమాకి బాలా దర్శకుడు. అప్పట్లో ఈ చిత్రం పెద్ద హిట్ గా నిలిచింది. తెలుగులో కూడా రిలీజ్ అయిన ఈ చిత్రం ఇక్కడ కూడా విజయం అందుకుంది. అంతేకాదు ఈ సినిమా విక్రమ్ కెరీర్ లోనే పెద్ద హిట్ గా నిలవగా అతని నటనకు నేషనల్ అవార్డు కూడా తెచ్చి పెట్టింది. మరో హీరో సూర్య నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. తాజా […]

Ravi Kiran

|

Feb 22, 2019 | 4:22 PM

తమిళ హీరోలు విక్రమ్, సూర్య కలిసి నటించిన చిత్రం ‘పితామగన్’. ఈ సినిమాకి బాలా దర్శకుడు. అప్పట్లో ఈ చిత్రం పెద్ద హిట్ గా నిలిచింది. తెలుగులో కూడా రిలీజ్ అయిన ఈ చిత్రం ఇక్కడ కూడా విజయం అందుకుంది. అంతేకాదు ఈ సినిమా విక్రమ్ కెరీర్ లోనే పెద్ద హిట్ గా నిలవగా అతని నటనకు నేషనల్ అవార్డు కూడా తెచ్చి పెట్టింది. మరో హీరో సూర్య నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని ఇప్పుడు హిందీలో రీమేక్ చేయనున్నారట. బాలీవుడ్ డైరెక్టర్ సతీష్ కౌశిక్ ఈ సినిమా రైట్స్ ని తీసుకున్నారని వినికిడి. ఈ సినిమాలో హీరోలు, ఇతర తారాగణం ఎవరూ అనేది తెలుసుకోవాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సి ఉంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu