‘మహానాయకుడు’ పై లక్ష్మీపార్వతి కామెంట్..!

'మహానాయకుడు' పై లక్ష్మీపార్వతి కామెంట్..!

ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ‘మహానాయకుడు’ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నందమూరి బాలకృష్ణ తీసిన ఎన్టీఆర్ బయోపిక్స్ రెండూ కూడా వాస్తవానికి దూరంగా ఉన్నాయని అన్నారు. రెండు పార్ట్స్ లో ఎక్కడా కూడా తన గురించి ప్రస్తావించలేదని.. ఒకవేళ ప్రస్తావిస్తే ఎన్టీఆర్ కు జరిగిన ద్రోహాన్ని కూడా ప్రస్తావించాల్సి వస్తుందని.. అందుకే ఆ ధైర్యం బాలకృష్ణ చేయలేకపోయాడు అని ఆమె పేర్కొన్నారు. ఎన్టీఆర్ ‘మహానాయకుడు’ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ […]

Ravi Kiran

| Edited By: Srinu Perla

Mar 07, 2019 | 5:42 PM

ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ‘మహానాయకుడు’ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నందమూరి బాలకృష్ణ తీసిన ఎన్టీఆర్ బయోపిక్స్ రెండూ కూడా వాస్తవానికి దూరంగా ఉన్నాయని అన్నారు. రెండు పార్ట్స్ లో ఎక్కడా కూడా తన గురించి ప్రస్తావించలేదని.. ఒకవేళ ప్రస్తావిస్తే ఎన్టీఆర్ కు జరిగిన ద్రోహాన్ని కూడా ప్రస్తావించాల్సి వస్తుందని.. అందుకే ఆ ధైర్యం బాలకృష్ణ చేయలేకపోయాడు అని ఆమె పేర్కొన్నారు.

ఎన్టీఆర్ ‘మహానాయకుడు’ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడం.. ఆ తర్వాత ఆయనను గద్దె దించడం.. రెండో సారి ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు అనేది చూపించారని ట్రైలర్ లోనే తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెట్టిన సమయంలో తను వెన్నంటే ఉన్నాను.. అలాంటి తనను ఏ సినిమాలోనూ చూపించలేదని లక్ష్మీపార్వతి వాపోయారు. తాను సినిమా చూడలేదని.. కొందరు సినిమా చూసి వాస్తవాలకు దూరంగా ఉందన్నారని ఆమె వెల్లడించారు. తన తండ్రికి జరిగిన అన్యాయాన్ని చూపించే ధైర్యం బాలకృష్ణ కు లేదని.. ఆయన ఎప్పుడో అది మర్చిపోయాడని ఆరోపించారు.  

రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మిస్ ఎన్టీఆర్’ గురించి ఆమె ప్రస్తావిస్తూ.. ఎన్టీఆర్ కు జరిగిన అన్యాయాన్ని, అవమానాన్ని కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారని ఆమె అన్నారు. ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నట్లు ఆమె తెలిపారు. ఏది ఏమైనా ఎన్టీఆర్ బయోపిక్, లక్ష్మిస్ ఎన్టీఆర్ రెండూ కూడా రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టిస్తున్న మాట మాత్రం వాస్తవం. ఇకపోతే ప్రజలు మాత్రం బాలయ్య కు ధైర్యం చాలకనే నిజాలు చూపించలేదని అనుకుంటున్నట్లు సమాచారం.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu