Lata Mangeshkar: లతాజీకి ఎన్ని వందల కోట్ల ఆస్తులున్నాయి? ఆమె తర్వాత వాటికి వారసులెవరంటే..
తేనె కన్నా తియ్యనైన స్వరంతో సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ పేజీ లిఖించుకున్న మధుర గాయని లతా మంగేష్కర్ (Lata Mangeshkar) ఈ లోకం నుంచి శాశ్వతంగా సెలవుతున్నారు.

తేనె కన్నా తియ్యనైన స్వరంతో సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ పేజీ లిఖించుకున్న మధుర గాయని లతా మంగేష్కర్ (Lata Mangeshkar) ఈ లోకం నుంచి శాశ్వతంగా సెలవుతున్నారు. అనారోగ్యంతో కొద్దిరోజలుగా ముంబయి (Mumbai) లోని బ్రీచ్ కాం ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న ఆమె ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆరోజు సాయంత్రమే ముంబయిలోని శివాజీ పార్క్‌లో అశ్రు నయనాల మధ్య లతాజీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. కాగా 5 ఏళ్ల వయసు నుంచే పాటలు ఆలపించడం ప్రారంభించిన లతా మంగేష్కర్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో లెజెండరీ సింగర్‌గా గుర్తింపుతెచ్చుకున్నారు. వివిధ భాషల్లో సుమారు 30 వేలకు పైగా పాటలు పాడారు. తన తియ్యటి స్వరంతో సంగీత ప్రియులను ఎంతగానో అలరించిన ఆమె అందుకు తగ్గట్టుగానే రెమ్యూనరేషన్ తీసుకునేవారు. ఈ క్రమంలో లతాజీ నికర ఆస్తుల (Lataji Assets) విలువ రూ.200 కోట్లకు పైగానే ఉన్నాయని సమాచారం. అదేవిధంగా ఆమె చివరి వరకు ముంబయిలోని ప్రభు కుంజ్ అనే నివాసంలోనే ఉన్నారు. ఇది కూడా కోట్ల రూపాయల విలువ చేస్తుందని సమాచారం. ఇవేగాక ముంబయి పెడ్లర్ రోడ్‌లో మరో విలాసవంతమైన ఇల్లు కూడా లతాజీకి ఉంది. కేవలం పాటల ద్వారానే కాకుండా ఇంటి అద్దెల రూపంలోనూ ఆమెకు భారీగా ఆదాయం వచ్చేది. ఇక ఆమె పాడిన పాటలకు రాయల్టీ ద్వారానే ఏడాదికి దాదాపు 5 కోట్ల సంపాదన వచ్చేదట.
ట్రస్ట్ కే లతాజీ ఆస్తులు?
లతాజీకి కార్లంటే కూడా బాగా ఇష్టం. తన పాటలకు గుర్తింపుగా చాలామంది దర్శకనిర్మాతలు ఆమెకు చాలా సందర్భాల్లో కార్లు బహూకరించారు.ఇప్పటికే ఆమె గ్యారేజ్‌లో షెవర్లే, బ్యూక్, క్రిస్లర్, మెర్సిడెజ్ కార్లున్నాయి. కాగా చివరి వరకు సంగీత ప్రపంచంలోనే జీవించిన లెజెండరీ సింగర్ పెళ్లి చేసుకోలేదు. దీంతో ఆమె ఆస్తులకు వారుసులెవరు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆమె సోదరీమణులు ఆశా భోస్లే, మీనా ఖడికర్, ఉషా మంగేష్కర్, సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్లకు ఈ ఆస్తులు దక్కుతాయని కొందరు అంటున్నారు. అలాగే తన తండ్రి పేరుపై కట్టించిన ట్రస్ట్‌కు కూడా లతాజీ ఆస్తులు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గాయని సోదరీమణులు, వారి కుటుంబీకులు ప్రస్తుతం మంచి పొజిషన్లోనే ఉన్నారు. ఆస్తులు కూడా బాగానే కూడ బెట్టుకున్నారు. దీంతో లతాజీ ఆస్తులు ఎక్కువ భాగం తండ్రి పేరుపై ఉన్న ట్రస్ట్‌కు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు. అయితే లతా మంగేష్కర్ మరణానంతరం ఆస్తులు ఎవరి పేరుపై ఆమె రాశారనేది ఇప్పటి వరకు తెలియడం లేదు. దీనిపై ఆమె లాయరు త్వరలోనే ఓ ప్రకటన జారీ చేయనున్నాడని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.
Also Read:
BCCI: బీసీసీఐ కొత్త ఆలోచన.. వారందరికి క్రికెట్ ఆడే అవకాశం.. ఎవరు వారు..? Women: మహిళలకు గమనిక.. డెలివరీ తర్వాత కెరీర్ కొనసాగాలంటే ఇవి తప్పనిసరి..