BCCI: బీసీసీఐ కొత్త ఆలోచన.. వారందరికి క్రికెట్ ఆడే అవకాశం.. ఎవరు వారు..?

భారత్ ఐదోసారి అండర్-19 వరల్డ్ కప్ గెలడంతో బీసీసీఐ(BCCI) కొత్త ఆలోచన చేస్తుంది. ఆటగాళ్లు కనుమరుగు కాకుండా ఓ విభాగం ఏర్పాటు చేయాలని భావిస్తోంది...

BCCI: బీసీసీఐ కొత్త ఆలోచన.. వారందరికి క్రికెట్ ఆడే అవకాశం.. ఎవరు వారు..?
Bcci
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 08, 2022 | 6:56 AM

భారత్ ఐదోసారి అండర్-19 వరల్డ్ కప్ గెలడంతో బీసీసీఐ(BCCI) కొత్త ఆలోచన చేస్తుంది. ఆటగాళ్లు కనుమరుగు కాకుండా ఓ విభాగం ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కొత్త అండర్‌-19+ వయో విభాగం జట్టును ఏర్పాటు చేయాలని బోర్డు యోచిస్తుంది. తద్వారా 19 ఏళ్లు దాటిన అండర్‌-19(under-19) ప్రతిభావంతులు క్రికెట్‌ వ్యవస్థ పరిధిలో ఉండేలా జాతీయ క్రికెట్‌ అకాడమీ (NCA) పర్యవేక్షణలో వాళ్లు పురోగతి సాధించేలా చూడాలని ఆలోచిస్తోంది. చాలా మంది అండర్-19 వరల్డ్ కప్‌ అందించిన వారు తర్వాత కనుమరుగవుతున్నారు. అందుకే బీసీసీఐ ఈ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది.

అండర్‌-19 ప్రపంచకప్‌లో సత్తా చాటిన షేక్‌ రషీద్‌ (ఆంధ్ర), రవి కుమార్‌ (బెంగాల్‌), రాజ్‌ అంగద్‌ బవా (చండీగఢ్‌), యశ్‌ ధుల్‌ (దిల్లీ)కు నేరుగా రంజీ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. కానీ ప్రస్తుత జట్టులోని మిగతా వారి అండర్‌-19 తదుపరి దశ, రంజీ ట్రోఫీకి మధ్య ఎటూ గాని స్థితిలో ఉంటుంది. స్టెట్ లెవల్‌లో అండర్‌-25 విభాగం ఉన్నప్పటికీ.. జట్లలోని కొన్ని స్థానాల కోసం విపరీతమైన పోటీ ఉంది. ‘‘సీనియర్‌ భారత జట్టు కోసం ఆటగాళ్లను సిద్ధం కోసం ఎన్‌సీఏ భవిష్యత్తులో అయిదు అంచెల వ్యవస్థపై దృష్టి పెట్టాలని భావిస్తోంది. ఈ వ్యవస్థలో మొదట అండర్‌-16, ఆ తర్వాత అండర్‌-19, ఎమర్జింగ్‌ (జాతీయ అండర్‌-23), ఎ జట్టు ఉంటాయి. ఈ వ్యవస్థలో ఇప్పుడు 19+ విభాగాన్ని ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. ఈ విభాగంలో ఈ కుర్రాళ్లందరినీ కలపొచ్చు’’ అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.

Read Also.. IND vs WI: రెండో వన్డేలో ఓపెనర్‌గా ఇషాన్ డౌట్.. రోహిత్‌తో ఇన్నింగ్స్ ఆరంభించేది ఎవరంటే?