Gautham Karthik: ఆ హీరోయిన్‌తో రిలేషన్‌షిప్.. మరో హింట్ ఇచ్చిన కోలీవుడ్ హీరో..
కోలీవుడ్ హీరో, హీరోయిన్లు గౌతమ్ కార్తిక్, మంజిమా మోహన్ (Manjima Mohan) గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారన్న పుకార్లు బాగా షికార్లు చేస్తున్నాయి.
కోలీవుడ్ హీరో, హీరోయిన్లు గౌతమ్ కార్తిక్, మంజిమా మోహన్ (Manjima Mohan) గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారన్న పుకార్లు బాగా షికార్లు చేస్తున్నాయి. వీరి ప్రేమకు పెద్దల ఆశీర్వాదం లభించిందని, త్వరలోనే ఈ ప్రేమజంట పెళ్లిపీటలెక్కుతుందని కోలీవుడ్ మీడియా కోడైకూస్తోంది. అయితే ఇప్పటివరకు అటు మంజిమా కానీ, కార్తిక్ కానీ తమ రిలేషన్‌షిప్‌పై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే మంజిమాతో రిలేషన్‌షిప్‌పై తాజాగా మరో హింట్ ఇచ్చాడు కార్తిక్ (Gautham Karthik). ఈనెల 11న మంజిమా పుట్టిన రోజు. ఆరోజు ఇన్‌స్టా స్టోరీస్‌లో తన ప్రియురాలికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఈ హీరో మంజిమాను ముద్దుగా మోమో అని పిలిచాడు. ‘మాంజిమా లాంటి అద్భుతమైన, శక్తిమంతమైన వ్యక్తి తన జీవితంలో ఉండటం గొప్పగా భావిస్తాను. హ్యాపీ బర్త్ డే మోమో’ అని పోస్ట్ పెట్టాడు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారన్న పుకార్లకు మరింత బలం చేకూరినట్లయింది.
అభినందన, అన్వేషణ తదితర చిత్రాలతో ఆకట్టుకున్న నిన్నటి తరం హీరో కార్తిక్ వారసుడే ఈ గౌతమ్ కార్తిక్. కాదల్ (తెలుగులో కడలి) తో వెండితెరకు పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే ఉత్తమ డెబ్యూ హీరోగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారం అందుకున్నాడు. ఇక మంజిమా మోహన్ విషయానికొస్తే.. తెలుగులో నాగచైతన్య సరసన సాహసం శ్వాసగా సాగిపో అనే చిత్రంలో నటించింది. ఇందులో చైతూ ప్రియురాలిగా ఆమె పోషించిన లీలా పాత్రకు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్‌లోనూ నారా భువనేశ్వరీ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా విష్ణు విశాల్ ‘ఎఫ్‌ఐఆర్’ చిత్రంలోనూ ఓ కీలక పాత్రలో నటించింది కాగా మంజిమా, గౌతమ్ కార్తిక్ ఇద్దరూ కలిసి ‘దేవరట్టం’ అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి ప్రేమకు పునాది పడింది. మొదట మంచి స్నేహితులుగా మారారు. ఆతర్వాత స్నేహం కాస్తా ప్రేమగా చిగురించింది. మరి తమ బంధంపై మంజిమా, కార్తీక్ ఎప్పుడు ఓపెన్ అవుతారో చూడాలి.
Also Read:PAN Alert: పాన్ కార్డ్ అలా వాడుతున్నారా? వెంటనే జాగ్రత్తపడకపోతే బుక్కైపోతారు..