AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chor Bazaar : హీరో విజయ్ దేవరకొండ వదిలిన ఆకాష్ పూరి “చోర్ బజార్’’ మెలోడీ

ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘‘చోర్ బజార్’’. గెహన సిప్పీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి  తెరకెక్కించారు.

Chor Bazaar : హీరో విజయ్ దేవరకొండ వదిలిన ఆకాష్ పూరి చోర్ బజార్’’ మెలోడీ
Chor Bazaar
Rajeev Rayala
|

Updated on: Mar 13, 2022 | 7:33 AM

Share

Chor Bazaar : ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘‘చోర్ బజార్’’. గెహన సిప్పీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి  తెరకెక్కించారు. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న “చోర్ బజార్” సినిమా నుంచి సాంగ్స్ ప్రమోషన్ స్టార్ట్ చేశారు. తాజాగా ఈ చిత్రంలోని ‘అబ్బబ్బా ఇది ఏం పోరి’ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. హీరోయిన్ అందాన్ని వర్ణిస్తూ సాగే పాట ఇది. పాట ఎలా ఉందో చూస్తే..అబ్బబ్బా ఇది ఏం పోరి..చూడగానే కళ్లు చెదిరి, కోసేసానమ్మో దాని జడపై మనసు పడి…మెడకీ నడుముకి నడుమ నాగుబాములాగ కదలాడి..ఉరిబోసిందమ్మో దాని కురులతో ఊపిరికి..అంటూ సాగుతుందీ పాట. సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించిన ఈ పాటను రామ్ మిర్యాల ఆకట్టుకునేలా పాడారు. మిట్టపల్లి సురేందర్ సాహిత్యాన్ని అందించారు.

భాను కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో సీనియర్ నాయిక అర్చన, హీరో ఆకాష్ పూరీ కనిపిస్తారు.  “చోర్ బజార్” సినిమా త్వరలో థియేటర్ ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇటీవలే ఈ సినిమా టైటిల్ సాంగ్ ను ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని విడుదల చేశాడు. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ ను విజయ్ దేవరకొండ విడుదల చేసి చిత్రయూనిట్ కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. కార్ల టైర్ల నుంచి బైక్ పార్టుల వరకు ప్రతిదీ ఎత్తేస్తూ చోర్ బజార్‌లో అమ్మేయడం ఈ గ్యాంగ్ పని. పాతబస్తీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.ఈ సినిమాతో ఆకాష్ పూరి మరో విజయాన్ని అందుకోవడం ఖాయం అంటున్నారు చిత్రయూనిట్.

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..