Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: వరుసగా 4 ప్లాపులు.. కట్ చేస్తే.. టాలీవుడ్‏ను ఏలేసిన చిన్నది.. ఏకంగా రూ.120 కోట్ల ఆస్తులు..

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస హిట్స్ అందుకున్న హీరోయిన్. తెలుగుతోపాటు తమిళం, హిందీలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అటు హీరోయిన్‏నే కాకుండా స్పెషల్ పాటలతో అదరగొట్టేసింది. కానీ కెరీర్ తొలినాళ్లలో ఆమె నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయ్యాయి. కట్ చేస్తే ఇప్పుడు ఆమె ఆస్తులు రూ.120 కోట్లు.

Tollywood: వరుసగా 4 ప్లాపులు.. కట్ చేస్తే.. టాలీవుడ్‏ను ఏలేసిన చిన్నది.. ఏకంగా రూ.120 కోట్ల ఆస్తులు..
Tamannah
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 19, 2025 | 8:22 AM

సినీరంగంలో కథానాయికగా తమకంటూ ఓ క్రేజ్ సంపాదించుకోవాలని ఎన్నో కలలతో చాలా మంది అమ్మాయిలు ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు. ఎన్నో అడ్డంకులు, అవమానాలను దాటుకుని అవకాశాలను అందుకుంటారు. అయితే కొందరు మొదటి సినిమాతోనే క్లిక్ కాగా.. మరికొందరికి మాత్రం అదృష్టం కలిసి రాదు. వరుసగా ప్లాప్ చిత్రాల్లో నటించి చివరకు స్టార్ డమ్ అందుకున్న తారలు సైతం ఉన్నారు. అందులో ఈ హీరోయిన్ ఒకరు. కెరీర్ తొలినాళ్లలో ఆమె నటించిన నాలుగు చిత్రాలు ప్లాప్ అయ్యాయి. అయినప్పటికీ అవకాశాలను అందుకుంటూ తన టాలెంట్ నిరూపించుకుంది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. తెలుగు, తమిళంలో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. దాదాపు దశాబ్దానికి పైగా టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేసింది. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఏకంగా రూ.120 కోట్లు సంపాదించిందట. ఇంతకీ ఆ వయ్యారి ఎవరో తెలుసా.. ? ఇంకెవరూ టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా.

మంచు మనోజ్ సరసన శ్రీ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు. దీంతో తమన్నాకు సరైన గుర్తింపు రాలేదు. అంతుక ముందే హిందీలో చాంద్ షా రోషన్ చెహ్రా అనే చిత్రంలో నటించింది. అలాగే తమిళంలో కేడీ, వియబారి చిత్రాల్లో నటించగా.. ఈ మూవీస్ అన్ని ప్లాప్ అయ్యాయి. అయినప్పటికీ ఈ బ్యూటీ అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉంది. చివరకు డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన హ్యాపీ డేస్ సినిమాతో తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకంటూ స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది.

తెలుగులో రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి, నాగ చైతన్య వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించిన తమన్నా.. తన క్రేజ్ తో టాలీవుడ్ ఇండస్ట్రీని ఊపేసింది. ఇప్పటికీ తెలుగు, హిందీలో ఈ అమ్మడుకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. అలాగే అటు వెబ్ సిరీస్ లోనూ సత్తా చాటుతుంది. ఇదిలా ఉంటే.. నివేదికల ప్రకారం తమన్నా ఆస్తులు రూ.120 కోట్లు ఉన్నట్లు సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరో విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరి వివాహం జరగనుంది.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..