KGF Chapter 2: కేజీఎఫ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఎట్టకేలకు సినిమా ట్రైలర్ వచ్చేస్తోంది.!
KGF Chapter 2: యష్ (Yash) హీరోగా, ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని చోట్ల ఈ సినిమా భారీ విజయాన్ని దక్కించుకుంది...

KGF Chapter 2: యష్ (Yash) హీరోగా, ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని చోట్ల ఈ సినిమా భారీ విజయాన్ని దక్కించుకుంది. గోల్డ్ మైనింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో కేజీఎఫ్ చాప్టర్ 2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కేజీఎఫ్ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సినిమాను థియేటర్స్‌లో చూద్దామా అని ఆసక్తితో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా కరోనా ప్రభావం తగ్గడంతో కేజీఎఫ్2ను ఏప్రిల్ 14న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమైంది.
ఇదిలా ఉంటే కేజీఎఫ్ సీక్వెల్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఒక చిన్న గ్లింప్స్ తప్ప మరో అప్‌డేట్‌ను ఇవ్వలేదు చిత్ర యూనిట్. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే తాజాగా తాజాగా చిత్ర యూనిట్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పెడుతున్నట్లు ఓ ప్రకటన చేసింది. ట్విట్టర్ వేదికగా కేజీఎఫ్ నుంచి ఏ అప్‌డేట్‌ను కోరుకుంటున్నారు.? అని ఓ పోల్‌ను ఏర్పాటు చేసింది. దీనికి సుమారు 70 శాతం మంది ట్రైలర్‌కావాలని ఓటింగ్ వేశారు.
We’re thrilled with the response from the KGF Army. Rollicking update coming your way very soon. Don’t let your eyes move away from this space. Get ready to experience the thunder of a cannonade. Stay tuned!#KGFChapter2 #KGF2onApr14 https://t.co/wc400psf8C
— Hombale Films (@hombalefilms) February 28, 2022
దీంతో దీనికి ప్రతిస్పందించిన చిత్ర యూనిట్ మరో ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌లో.. ‘కేజీయఫ్ ఆర్మీ చూపించిన ఆదరణను చూసి మాకు ఎంతో సంతోషమేసింది. త్వరలోనే అదిరిపోయే అప్‌డేట్ రాబోతోంది. ఆ అప్‌డేట్ కోసం వేచి ఉండండి’ అని రాసుకొచ్చింది. దీనిబట్టి చూస్తుంటే 70 శాతం కోరిక మేరకు ట్రైలర్‌ను విడుదల చేస్తారని స్పష్టమవుతోంది. మరి కేజీఎఫ్ 2 ట్రైలర్ ఎప్పడొస్తుందో చూడాలి.
Health Tips: ఈ జ్యూస్ తాగితే వేగంగా బరువు తగ్గొచ్చు.. ఎలా తయారు చేయాలి, ఏ టైంలో తీసుకోవాలంటే?
Narayana Swamy-YS Jagan: సినిమా హీరో కాదు.. సీఎం జగన్ హీరోలకే హీరో.. ఏపీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు




