Health Tips: ఈ జ్యూస్ తాగితే వేగంగా బరువు తగ్గొచ్చు.. ఎలా తయారు చేయాలి, ఏ టైంలో తీసుకోవాలంటే?

Weight Loss Tips: బరువు తగ్గడానికి చాాలామంది వివిధ పద్ధతులను అనుసరిస్తుంటారు. ఇటువంటి పరిస్థితిలో ఈ జ్యూస్‌ తీసుకొని త్వరగా బరువు తగ్గొచ్చు.

Health Tips: ఈ జ్యూస్ తాగితే వేగంగా బరువు తగ్గొచ్చు.. ఎలా తయారు చేయాలి, ఏ టైంలో తీసుకోవాలంటే?
Tomato Juice
Follow us
Venkata Chari

|

Updated on: Feb 28, 2022 | 6:52 PM

Weight Loss Tips: బరువు తగ్గడం అనేది ఊబకాయుల(Obesity)ను ఎక్కువగా వేధిస్తోన్న ప్రశ్న. బరువు తగ్గడానికి ఎన్నో పద్ధతులను అనుసరిస్తుంటారు. క్రమమైన వ్యాయామం(Exercise), సమతుల్య ఆహారం మొదలైన వాటి సహాయంతో, ప్రజలు బరువు తగ్గించడంలో విజయం సాధిస్తారు. అయితే ఈరోజు మనం బరువు తగ్గేందుకు సహాయపడే ఓ జ్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం. టొమాటో జ్యూస్‌ని ఉపయోగించి పొట్ట కొవ్వుతోపాటు పెరుగుతున్న బరువు తగ్గించుకోవచ్చు. దీన్ని సరైన పద్ధతిలో క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ బరువును తగ్గించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో మీరు టమోటా రసం తాగడం ద్వారా బరువు తగ్గడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

త్వరగా బరువు తగ్గడానికి టమోటా రసం ఎలా తయారుచేయాలంటే?

కావలసినవి – టొమాటోలు 5, ఎండుమిర్చి పొడి 1 టేబుల్ స్పూన్, తేనె 1 టేబుల్ స్పూన్

తయారుచేసే విధానం- ముందుగా టొమాటోలను శుభ్రం చేసి బ్లెండర్‌లో వేసి బాగా కలపాలి. బ్లెండింగ్ చేసిన తర్వాత అందులో ఎండుమిర్చి పొడి వేసి బాగా బ్లెండ్ చేయాలి. అనంతరం ఈ రసాన్ని ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోవాలి. దానికి నల్ల మిరియాల పొడి, తేనె జోడించండి. దీనిని ఖాళీ కడుపుతో తాగాలి.

బరువు తగ్గడానికి టొమాటో జ్యూస్ ఎప్పుడు తీసుకోవాలి- పొట్ట కొవ్వు పెరగడం వల్ల మీరు ఇబ్బంది పడుతుంటే, టొమాటో జ్యూస్ తీసుకోవడం చాలా మంచిది. టొమాటోలో ఉండే మూలకాలు బరువు తగ్గించడంలో మీకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా, శరీరాన్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచడంలో దీని వినియోగం ప్రయోజనకరంగా ఉంటుంది.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు డాక్టర్‌ని సంప్రదించండి.

Also Read: Epilepsy: ఈ లక్షణాలుంటే అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. తీవ్రమైన మూర్ఛ వ్యాధికి దారి తీయొచ్చు..

Gluten Free Cake Recipe: పాలు, క్రీమ్ లేకుండా కేక్ ఈజీగా తయారు చేసుకోవచ్చు తెలుసా..? షుగర్ ఫ్రీ రెసిపీ మీకోసం..