Epilepsy: ఈ లక్షణాలుంటే అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. తీవ్రమైన మూర్ఛ వ్యాధికి దారి తీయొచ్చు..

Epilepsy Symptoms: ప్రపంచవ్యాప్తంగా ఐదు కోట్లకు పైగా ప్రజలు మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నారు. వారిలో 80 శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందినవారే ఉండటం ఆందోళన కలిగించే విషయం.

Epilepsy: ఈ లక్షణాలుంటే అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. తీవ్రమైన మూర్ఛ వ్యాధికి దారి తీయొచ్చు..
Epilepsy Symptoms
Follow us

|

Updated on: Feb 28, 2022 | 1:59 PM

Epilepsy Symptoms: ప్రపంచవ్యాప్తంగా ఐదు కోట్లకు పైగా ప్రజలు మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నారు. వారిలో 80 శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందినవారే ఉండటం ఆందోళన కలిగించే విషయం. అయితే.. భారతదేశంలో తలనొప్పి తర్వాత ఇది రెండవ అత్యంత సాధారణ దీర్ఘకాలిక నాడీ సంబంధిత వ్యాధిగా ఉంది. మెదడు (Brain Disease) లో ఇన్ఫెక్షన్, ఏదైనా సమస్య ఉంటే మూర్ఛ వ్యాధి వస్తుంది. అధిక మత్తు పదార్థాలు తీసుకోవడం, మెదడుకు ఆక్సిజన్ తక్కువగా అందడం, తల గాయం కూడా మూర్ఛకు కారణం కావచ్చు. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. మూర్ఛ అనేది ఇతర వ్యాధుల మాదిరిగానే ఒక ధీర్ఘకాలిక వ్యాధి. అయితే ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కొరవడింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు దీనిని వ్యాధిగా పరిగణించరు. దాని చికిత్స కోసం పలు రకాల నాటు పద్దతులను పాటిస్తారు. కానీ వైద్యులను మాత్రమం సంప్రదించరు. చాలా మంది ఇది అంటువ్యాధి అనే అపోహలో ఉంటారు. దీనికి మంత్రగాళ్లను కూడా ఆశ్రయిస్తుంటారు.

మెదడులోని న్యూరాన్ కణాల పరిస్థితి క్షీణించి.. సమస్యగా మారి క్రమంగా మూర్ఛకు దారితీస్తుందని సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ దీపక్ కుమార్ పేర్కొన్నారు. మెదడులో ఇన్ఫెక్షన్ వచ్చినా మూర్ఛ రావడం మొదలవుతుంది. దీనికి నిర్దిష్ట కారణం అంటూ లేదు. ఇది జన్యుపరమైన వ్యాధి కాదు లేదా నిర్దిష్ట వయస్సులో సంభవించదు. మూర్ఛ వ్యాధి కూడా రెండు రకాలుగా ఉంటుందని దీపక్ కుమార్ పేర్కొన్నారు. చాలా సందర్భాలలో.. రోగి మెదడులోని ఒక చిన్న భాగం మాత్రమే ప్రభావితమవుతుంది. కొంతమంది రోగులకు మొత్తం మెదడులో ఇన్ఫెక్షన్ సోకి మూర్ఛ వస్తుంది. అలాంటి వారు జీవితాంతం మందులు వాడాల్సి రావచ్చు. చాలా తీవ్రమైన సందర్భాల్లో రోగికి ఆపరేషన్ చేయడం కూడా అవసరం. మూర్ఛ వచ్చినప్పుడు వెంటనే వైద్యుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.

పిల్లలకు కూడా సమస్యలు ఉన్నాయి

డాక్టర్ దీపక్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ సమస్య పిల్లలలో కూడా పెద్ద సంఖ్యలో కనిపిస్తుంది. కానీ తల్లీదండ్రులు దీనికి సరైన విధంగా చికిత్స ఇప్పించరు. పిల్లలకి మూర్ఛ వ్యాధి వచ్చినప్పుడు.. ప్రజలు వారి నోటిలో చెంచా, వేళ్ల దగ్గర తాళాలు, నీరు చల్లడం లాంటివి చేస్తారు. అయితే ఇలా అస్సలు చేయకూడదు. మొదట్లోనే మూర్ఛ గురించి వైద్యులను సంప్రదిస్తే.. చికిత్స సులువుగా అందించవచ్చు. సాధారణంగా మూర్ఛ నాలుగు-ఐదు నిమిషాల్లోనే ఆగిపోతాయి. దీంతో ఇదేం పెద్ద వ్యాధి కాదని.. చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే.. చాలా మంది పిల్లలకు ఎపిలెప్టిక్ మూర్ఛలు పదేపదే వస్తుంటాయి. వారి మెదడుపై ఈ వ్యాధి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఆ తర్వాత సరైన చికిత్స అందించలేకపోతే.. ప్రమాద తీవ్రత పెరుగుతుంది. అందుకే ఎవరైనా పిల్లలకు పదే పదే మూర్ఛలు వస్తున్నట్లయితే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడం మంచిది.

మూర్ఛ వ్యాధి లక్షణాలు

స్పృహతప్పి పడిపోవడం

అకస్మాత్తుగా శరీరం మొత్తం వణుకుతుంది

శరీరం పూర్తిగా సహకరించదు

చేతులు, కాళ్ళ కండరాలు బిగుతుగా మారుతాయి

Also Read:

Pregnancy Tips: ప్రెగ్నెన్సీ సమయంలో ఉద్యోగం చేస్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి

Viral Video: తగ్గేదెలే.. నెమలి-మేక మధ్య హోరాహోరి పోరు..! వీడియో చూస్తే మతిపోవాల్సిందే..

20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..