Viral Video: తగ్గేదెలే.. నెమలి-మేక మధ్య హోరాహోరి పోరు..! వీడియో చూస్తే మతిపోవాల్సిందే..

Peacock and Goat Fight: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి.

Viral Video: తగ్గేదెలే.. నెమలి-మేక మధ్య హోరాహోరి పోరు..! వీడియో చూస్తే మతిపోవాల్సిందే..
Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 28, 2022 | 12:20 PM

Peacock and Goat Fight: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. వాస్తవానికి పెంపుడు జంతువులకు హాని తలపెట్టనంతవరకు.. అవి కూడా ఎవ్వరి జోలికి వెళ్లవు. ఇక సింహం, పులి, చిరుతపులి లాంటి క్రూర జంతువులైతే.. ఏకంగా దాడి చేస్తాయి. అయితే.. పెంపుడు జంతువులు మాత్రం వీటికి భిన్నంగా ఉంటాయి. వాటికి కోపం వచ్చినా కానీ పెద్దగా భయపడాల్సిన పనిలేదు. తాజాగా.. శాఖాహార జంతువులు నెమలి-మేక తెగ పొట్లాడుకున్నాయి. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియా (Social Media) లో తెగ వైరల్ అవుతోంది. ఇందులో శాంతంగా కనిపించే నెమలి కూడా కోపంతో మేకపైకి దూసుకెళుతుంది. రెండూ కూడా ఢీకొంటాయి. మేక నుంచి తప్పించుకోవడానికి నెమలి.. నెమలి నుంచి తప్పించుకోవడానికి మేక.. అనుసరించే తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇది (Viral Video) చూసిన నెటిజన్లంతా తెగ నవ్వుకుంటున్నారు.

వైరల్ వీడియోలో మేక – నెమలి రెండు కూడా ఎదురెదురుగా నిలబడి ఉండటాన్ని చూడవచ్చు. ఇందులో మేక కోపంగా చూస్తూ తన కొమ్ములతో నెమలిపై మొదట దాడి చేస్తుంది. అయితే మేక దగ్గరికి చేరుకోగానే.. నెమలి పైకి ఎగిరి అవతలి వైపుకు చేరుకుంటుంది. ఇలా చాలా సార్లు జరుగుతుంది. ఈ క్రమంలో మేక దాడి చేసిన ప్రతీసారి నెమలి ఉపాయాలను అనుసరించి తప్పించుకుంటుంది. ఈ ఫన్నీ వీడియో చూసి చాలామంది నవ్వుకుంటున్నారు. మేక, నెమలి మధ్య ఇలాంటి పోరు ఎప్పుడూ చూడలేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ వీడియో..

ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పంచుకున్నారు. ఎల్లప్పుడూ నీ బలాన్ని మాత్రమే నమ్ముకో.. దేవుడు ప్రతి ఒక్కరికీ కష్టాలను ఎదుర్కొనే శక్తి ఇచ్చాడంటూ.. క్యాప్షన్‌ రాశారు. ఈ 9 సెకన్ల ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Also Read:

Viral Video: డేగా.. మజాకా.. నక్కను ఎలా వేటాడిందో చూస్తే షాకవ్వాల్సిందే!

Viral Video: వేదికపైనే పొట్టు పొట్టుగా కొట్టుకున్న వధూవరులు.. కారణం తెలిస్తే ఫ్యూజులు ఔట్..!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!