AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వేదికపైనే పొట్టు పొట్టుగా కొట్టుకున్న వధూవరులు.. కారణం తెలిస్తే ఫ్యూజులు ఔట్..!

Wedding Viral Video: సోషల్ మీడియాలో వివాహ వేడుకలకు సంబంధించిన ఎన్నో వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. వీటిలో వధూవరుల డ్యాన్స్.. కుటుంబసభ్యుల సందడి..

Viral Video: వేదికపైనే పొట్టు పొట్టుగా కొట్టుకున్న వధూవరులు.. కారణం తెలిస్తే ఫ్యూజులు ఔట్..!
Wedding
Shaik Madar Saheb
|

Updated on: Feb 28, 2022 | 8:14 AM

Share

Wedding Viral Video: సోషల్ మీడియాలో వివాహ వేడుకలకు సంబంధించిన ఎన్నో వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. వీటిలో వధూవరుల డ్యాన్స్.. కుటుంబసభ్యుల సందడి.. అదే విధంగా స్నేహితుల అల్లరి ఇలా చాలానే ఉంటాయి. వైరల్ అయ్యే వాటిల్లో ఫన్నీగా ఉండే వీడియోలే అధికంగా ఉంటాయి. తాజాగా.. వధూవరులకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వేదికపైనే వధూవరులిద్దరూ గొడవపడతారు. ఇదంతా చూసి నెటిజన్లు ఇప్పుడే ఇలా గొడవ పడితే.. మున్ముందు వీళ్ల పరిస్థితి ఏంటో అంటూ నోరెళ్లబెడుతున్నారు. సాధారణంగా.. వివాహ వేడుకను ఎప్పటికీ గుర్తుండిపోయేలా నిర్వహించుకుంటారు. ఈ వేడుకకు సంబంధించిన కొన్ని క్షణాలు మన ఆల్బమ్‌లో ఉన్న వాటి కంటే.. ఎక్కువగా మన జ్ఞాపకాలలో నిలిచిపోతాయి. అలాంటి వేడుకలో చిన్న పొరపాట్లు జరగడం సాధారణం. కానీ.. గొడవకు దిగి నవ్వుల పాలవుతున్నాయి కొన్ని జంటలు. అలాంటి వెడ్డింగ్‌కు సంబంధించిన ఫన్నీ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో వధూవరులు ఇద్దరూ వేదికపై నిలబడి ఉన్నారు. వరమాల వేడుకలో వరుడు తన కాబోయే వధువుకు స్వీట్లు తినిపించడానికి ప్రయత్నించడాన్ని మీరు చూడవచ్చు. ఈ క్రమంలో వధువు స్వీట్ తినడానికి నిరాకరిస్తుంది. దీంతో వరుడికి కోపం వచ్చి పెళ్లికూతురు ముఖంపై స్వీటును విసిరేస్తాడు. ఆ తర్వాత ప్రతీకారం తీర్చుకునేందుకు పెళ్లికూతురు కూడా వరుడిపై స్వీట్‌ను విసిరేస్తుంది. వధువు అలా చేసిందన్న కోపంతో వరుడు.. వేదికపైనే అందరి ముందు వధువును రెండు మూడు సార్లు చెంపదెబ్బ కొడతాడు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. బహుశా ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడమే కారణమని తెలుస్తోంది.

వైరల్ వీడియో..

ఈ వీడియో ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో తెగ వైరల్ అవుతోంది. దీనిని 12 లక్షలకు పైగా మంది వీక్షించగా.. వేలాది మంది లైక్ చేశారు. దీంతోపాటు యూజర్లు పలు ఫన్నీ కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇప్పుడే గొడవ పడుతున్నారు.. మున్ముందు ఎలా ఉంటుందోనని.. ఒకరు కామెంట్ చేయగా.. బహుశా పెళ్లి అంటే ఇద్దరికీ ఇష్టం లేదేమోనంటూ మరొకరు కామెంట్ చేశారు.

Also Read:

Viral Video: ద్వేవుడా.. ఇదేం షేక్‌రా నాయనా.. చూస్తుంటేనే బుర్ర హీటెక్కుతోంది.. వీడియో

Vangaveeti Radha: రంగా అభిమానులు తలుచుకుంటే.. వంగవీటి రాధా సంచలన కామెంట్స్‌..

Manipur Election 2022: మణిపూర్‌లో తొలిపోరు ప్రారంభం.. 38 స్థానాలకు 173 మంది అభ్యర్థుల పోటీ