Manipur Election 2022: మణిపూర్‌లో తొలిపోరు ప్రారంభం.. 38 స్థానాలకు 173 మంది అభ్యర్థుల పోటీ
Manipur Assembly Elections 2022: మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తొలివిడత పోలింగ్ ప్రారంభమైంది. 60 స్థానాలు ఉన్న మణిపూర్ అసెంబ్లీకి సోమవారం ఐదు జిల్లాల పరిధిలోని
Manipur Assembly Elections 2022: మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తొలివిడత పోలింగ్ ప్రారంభమైంది. 60 స్థానాలు ఉన్న మణిపూర్ అసెంబ్లీకి సోమవారం ఐదు జిల్లాల పరిధిలోని 38 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి దశలో ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, బిష్ణుపూర్, చురచంద్‌పూర్, కాంగ్‌పోక్పి జిల్లాల్లోని 38 నియోజకవర్గాలకు ఈరోజు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. తొలి దశలో 15 మంది మహిళలు సహా మొత్తం 173 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 12,09,439 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 5,80,607 మంది పురుషులు, 6,28,657 మంది మహిళలు మరియు 175 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. మొత్తం 1,721 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. కోవిడ్ పాజిటివ్ లేదా క్వారంటైన్‌లో ఉన్న ఓటర్లు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య చివరి గంటలో ఓటు వేయడానికి అనుమతించనున్నారు.
మణిపూర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రాజేష్ అగర్వాల్ మాట్లాడుతూ.. పోటీలో ఉన్న అభ్యర్థులలో 39 మంది నేర చరిత్ర కలిగి ఉన్నారన్నారు. భారతీయ జనతా పార్టీ మొత్తం 38 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. కాంగ్రెస్ 35 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. జనతాదళ్ (యునైటెడ్) 28 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. కాగా.. రెండో విడత పోలింగ్ మార్చి 5న జరగనుంది. రెండో దశలో 22 స్థానాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు.
కాగా.. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పిపి), నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పిఎఫ్), లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జెపి)ల మద్దతుతో 2017లో మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, ఈసారి ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్న బీజేపీ మొత్తం 60 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ఆరు రాజకీయ పార్టీల కూటమిని ఏర్పాటు చేసి దానికి మణిపూర్ ప్రోగ్రెసివ్ సెక్యులర్ అలయన్స్ (MPSA) అని పేరు పెట్టింది.
CM and BJP candidate from Heingang, N Biren Singh casts his vote at Shrivan High School in Imphal.
He says, “I’m expecting that 75% people of my constituency will vote for BJP & me. BJP is expecting at least 30 out of 38 seats in the first phase. People of Manipur like PM Modi” pic.twitter.com/dgr5SxGxuj
— ANI (@ANI) February 28, 2022
Also Read: