Ice Wall Climbing: లడఖ్‌లో తొలిసారిగా ఐస్ వాల్ క్లైంబింగ్ పోటీలు.. భారీగా పాల్గొన్న పర్వతారోహకులు
Ice Wall Climbing Competition: మంచులో మామూలుగా నడవటమే చాలా కష్టం. అలాంటిది, నిటారుగా ఉన్న మంచు గోడను ఎక్కారు ఆ పర్వతారోహకులు.
Ice Wall Climbing Competition: మంచులో మామూలుగా నడవటమే చాలా కష్టం. అలాంటిది, నిటారుగా ఉన్న మంచు గోడను ఎక్కారు ఆ పర్వతారోహకులు. అది ఎక్కడో తెలుసుకోండి.. మాములుగా చలికాలంలో బయటికి వెళ్లాలంటేనే వణికిపోతారు. అలాంటిది మన దేశం సరిహద్దుల్లో గడ్డకట్టే మంచులోనూ గస్తీ కాస్తారు సైనికులు. వారిలో క్రీడా స్ఫూర్తిని నింపడానికి చర్యలు చేపట్టారు ఉన్నతాధికారులు. లడఖ్ (Ladakh) లో తొలిసారిగా ఐస్ వాల్ క్లైంబింగ్ పోటీని నిర్వహించారు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు. కేవలం గస్తీ కాసే సైనికులే కాకుండా, బయటివాళ్లు కూడా ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. ఈ ఈవెంట్‌లో 13 జట్లకు చెందిన 100 మందికి పైగా పర్వతారోహకులు పాల్గొన్నారు. నార్త్-వెస్ట్ ఫ్రాంటియర్ ప్రధాన కార్యాలయం, లేహ్ లడఖ్ మౌంటెనీరింగ్ గైడ్ అసోసియేషన్ సహకారంతో, ITBP ఈ పోటీలను నిర్వహిస్తోంది.
నిపుణుల సమక్షంలో పర్వతారోహకులు ఐస్ వాల్ క్లైంబింగ్‌లో పాల్గొన్నారు. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్.కె మాథుర్ ఈ ఐస్ వాల్ క్లైంబింగ్ పోటీని ప్రారంభించారు. సరిహద్దుల్లో ఉండి దేశాన్ని కాపాడుతున్న సైనికుల రుణం తీర్చుకోలేనిదన్నారు ఆర్.కె మాథుర్. ఈ పోటీలను నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్. పోటీల నిర్వాహకులను అభినందించారు ఆర్.కె మాథుర్. భవిష్యత్తులోనూ ఇలాంటి పోటీలను నిర్వహించాలని సూచించారు. 1962లో ITBPని స్థాపించారని, అప్పటినుంచి దేశ సరిహద్దుల్లో నిరంతరం బలగాలు కాపలా కాస్తున్నాయని చెప్పారు.
ఇదిలా ఉండగా, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్‌కి చెందిన హిమ్‌వీర్లు, హిమాచల్‌ప్రదేశ్‌లోని 14 వేల అడుగుల ఎత్తులో, మంచు కురుస్తున్న సమయంలో సరిహద్దుల్లో గస్తీ కాస్తున్నారు. ఆ పెట్రోలింగ్ ప్రదేశంలో ఉష్ణోగ్రత మైనస్ 20 డిగ్రీలు ఉంది. వారు గస్తీ కాసే ఫొటోలను షేరు చేశారు ITBP అధికారులు.
Lt. Governor @R_K_Mathur also spoke of the administration’s endeavor to popularise #winteradventuresports and strengthening capabilities to carry out #rescuemissions.
The opening event of IWC competition witnessed live demonstration of #IceWallClimbing and #MedicalRescue drills. pic.twitter.com/Bvr9NgB7aB
— Office of the Lt. Governor, Ladakh (@lg_ladakh) February 26, 2022
Also Read: