Viral Video: దొంగను రక్షించాడు.. చివరికి ఆ దొంగకే బలయ్యాడు.. వీడియో చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి..!
Viral Video: ధర్మం, అధర్మం, వెన్నుపోటు అనే పదాలను మనం తరచుగా వింటూనే ఉంటాం. కొందరు మన వెన్నంటే ఉండి నమ్మక ద్రోహం చేస్తుంటారు.
Viral Video: ధర్మం, అధర్మం, వెన్నుపోటు అనే పదాలను మనం తరచుగా వింటూనే ఉంటాం. కొందరు మన వెన్నంటే ఉండి నమ్మక ద్రోహం చేస్తుంటారు. ఇంకొందరు.. నమ్మించి వంచిస్తుంటారు. మరికొందరైతే సాయం పొందిన చేతినే నరికేసే రకం ఉంటారు. ఇప్పుడు మనం మూడో రకం వ్యక్తి గురించి చెప్పుకోబోతున్నాం. కాదు కాదు.. చూడబోతున్నాం. ఇప్పటి వరకు విన్న పదాలన్నింటికీ నిదర్శనం ఈ వ్యక్తి. పాపం అని రక్షిస్తే.. తన వక్రబుద్ధిని చాటుకుని వెన్నుపోటు పొడిచాడు. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు వివరాల్లోకెళదాం..
ఓ వ్యక్తి రోడ్డు పక్కన నిల్చుని ఫోన్ చూస్తూ ఉంటాడు. ఇంతలో మరో వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకుని పరుగెత్తుకుంటూ అతన్ని సమీపిస్తాడు. అటూ ఇటూ చూసి పక్కనే ఉన్న పాన్ షాప్ వెనుక దాక్కుంటాడు. పోలీసులకు తాను లేనని చెప్పమంటాడు. అయ్యో పాపం అని భావించి.. పోలీసులు సమాచారం అడిగినా తప్పుడు సమాచారం చెప్పి పోలీసులను పంపించేస్తాడు. దాంతో పోలీసులు మరోవైపు వెళ్లిపోగా.. సదరు దొంగ దర్జాగా వచ్చి తనకు సాయం చేసిన వ్యక్తి పక్కనే నిల్చుంటాడు. మరి వక్రబుద్ధి ఎటుపోతుంది చెప్పండి.. సాయం చేశాడు, తనను పోలీసుల నుంచి రక్షించాడనే కృతజ్ఞత ఏమాత్రం లేకుండా ప్రవర్తించాడు. తనకు రక్షించిన వ్యక్తి జేబులోంచి పర్స్ కొట్టేసి పారిపోయాడు ఆ దొంగ. కాసేపటి తరువాత ఆ వ్యక్తి పర్స్ కోసం చూస్తే.. కనిపించలేదు. దాంతో షాక్ అయ్యాడు బాధిత వ్యక్తి. అందుకే అంటారు పాముకు పాలు పోసి పెంచినా కాటేయక మానదు అని. ఈ చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది కదా వెన్నుపోటు, నయ వంచన అంటూ నెటిజన్లు తమదైన స్టైల్లో కామెంట్స్ పెడుతున్నారు.
View this post on Instagram
Also read:
Telangana: అది నా అడ్డా అంటున్న ఎమ్మెల్యే.. అంతలేదు అంటున్న మాజీ ఎంపీ.. ఇంతకీ వీరి గొడవేంటో తెలుసా?
Viral Video: పుష్పా సాంగ్‌తో అదరగొట్టిన ఎమ్మెల్యే.. ఊ అంటారా తల్లి ఉహూ అంటారా అంటూ..