Viral Video: డేగా.. మజాకా.. నక్కను ఎలా వేటాడిందో చూస్తే షాకవ్వాల్సిందే!

బలవంతులకు, బలహీనులకు మధ్య ప్రతీ రోజూ ఓ యుద్ధం జరుగుతుంది. ఇక ఆ యుద్ధం బలహీనులు గెలవాలంటే.. కచ్చితంగా తెగువ చూపించాల్సిందే...

Viral Video: డేగా.. మజాకా.. నక్కను ఎలా వేటాడిందో చూస్తే షాకవ్వాల్సిందే!
Eagle & Fox
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 28, 2022 | 10:55 AM

అడవి నియమాలు చాలా విభిన్నంగా ఉంటాయి. అక్కడ ఎలప్పుడూ బలవంతులే రాజ్యం ఏలుతారు. బలవంతులకు, బలహీనులకు మధ్య ప్రతీ రోజూ ఓ యుద్ధం జరుగుతుంది. ఇక ఆ యుద్ధం బలహీనులు గెలవాలంటే.. కచ్చితంగా తెగువ చూపించాల్సిందే. తెలివి, చురుకుదనం, క్రూర జంతువులను మస్కా కొట్టడం తెలిస్తే చాలు.. సాధు జంతువులు బ్రతికిపోయినట్లే. ఇదిలా ఉంటే.. పక్షులలో డేగ అత్యంత ప్రమాదకరమైన ప్రిడేటర్. అవి ఆకాశం నుంచే తమ ఎరను ఎంచుకోవడమే కాదు.. దాని చూపు నుంచి అది తప్పించుకోకుండా రెప్పపాటులో వేటాడగలవు. అలాంటి డేగ ఆకాశం నుంచి ఓ నక్కను ఎట్టా వేటాడిందో చూస్తే షాకవ్వాల్సిందే. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ కొండపై డేగ ఎగురుతున్న దృశ్యాన్ని మీరు చూడవచ్చు. ఒక్కసారిగా డేగ కళ్లు క్రింద వెళ్తున్న నక్కపై పడ్డాయి. ఇంకేముంది రెప్పపాటులో వేగంగా ఎగురుకుంటూ నక్కపై దాడికి దిగుతుంది డేగ. తన పదునైన గోళ్లతో నక్కను పట్టుకుని పైకి ఎగరాలని ప్రయత్నిస్తుంది. కానీ అది కుదరదు. పట్టు కాస్తా తప్పుతుంది. దీనితో డేగ మరోసారి నక్కపై దాడికి దిగుతుంది. ఈసారి ఏమాత్రం తప్పు జరగకుండా నక్కను గట్టిగా తన పదునైన గోళ్ళతో పట్టుకుంటుంది. ఎంత ప్రయత్నించినా నక్క ఆ పట్టును విడిపించుకోలేకపోతుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా, ఈ వీడియోను ‘Life And Nature’ అనే ట్విట్టర్ పేజీ అప్‌లోడ్ చేయగా.. నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. ఇప్పటిదాకా ఈ వీడియోకు 3,682 వ్యూస్ వచ్చాయి. ‘పవర్ ఫుల్ ఈగిల్స్’ అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. ‘పుతిన్‌కు ఇదే జరుగుతుంది’ అని మరొకరు కామెంట్ చేశారు. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి వీడియోపై లుక్కేయండి.

Also Read: Viral News: పరీక్షలో మెడికల్ స్టూడెంట్ హైటెక్ కాపీ.. వాడి టాలెంట్‌కు ఇన్విజిలేటర్ ఫ్యూజులు ఔట్!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!