Viral Video: అయ్యో పిల్లా.. ఎంత పనాయే.. లైక్స్ వస్తాయనుకుంది.. దెబ్బకు దిమ్మతిరిగిపోయింది..
ప్రస్తుతం సోషల్ మీడియాలో రీల్స్ ఎంత ఫేమస్ అయ్యాయో తెలిసిన విషయమే. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా రీల్స్ చేసి సెలబ్రెటీస్ అయిపోతున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో రీల్స్ ఎంత ఫేమస్ అయ్యాయో తెలిసిన విషయమే. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా రీల్స్ చేసి సెలబ్రెటీస్ అయిపోతున్నారు. యూట్యూబ్, ఇన్‌స్టాలో రీల్స్ చేసి పాపులారిటీ సంపాదించుకోవడమే కాకుండా.. ఆర్థికంగా నిలదొక్కుకున్నవారు ఉన్నారు. రీల్స్ చేయడంలో ఒక్కొక్కరూ ఒక్కొ విధంగా.. సరికొత్తగా ట్రై చేస్తుంటారు. ముఖ్యంగా నెటిజన్లకు ఆకట్టుకోవడానికి.. మిలియన్స్‌లో లైక్స్, షేర్స్ రావడం కోసం కొత్త కొత్తగా ఆలోచిస్తుంటారు. అలా ఇప్పటివరకు బోలేడన్ని షార్ట్ వీడియోస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే కొన్నిసార్లు విభిన్నంగా రీల్స్ చేయడానికి ప్రయత్నించినప్పుడు అవి ఫెయిల్ అవుతుంటాయి. అనుకోకుండా జరిగిన ఘటనలు చేసేవారికి షాకిచ్చిన నెటిజన్లకు మాత్రం నవ్వులు తెప్పిస్తుంటాయి. ఇప్పుడు అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది.
ఆ వీడియోలో ఓ యువతి రోడ్డు పక్కన నిల్చోని వాహనం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఆమె వెనకాలే ఓ వ్యక్తి వీడియో తీస్తూ వస్తాడు. అలా వీడియో తీస్తూ వచ్చిన వ్యక్తి ఆ యువతి భుజం తట్టి చేయి అందిస్తాడు. వెంటనే అతని చేతిని నవ్వుతూ పట్టుకుని స్టైలీష్‌గా పక్కన పరిగెత్తాలి అనుకుంది. అలా పరిగెడుతూ పక్కనే ఉన్న విద్యు్త్ స్థంభానికి ఢికొట్టింది. ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్… ఆ ఆమ్మాయిది ఓవర్ యాక్షన్ అని… దెబ్బకు దిమ్మతిరిగిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి రీల్స్ చేసి ఫేమస్ కావాలనుకుంది.. కానీ కళ్లు బైర్లు కమ్మాయి.
View this post on Instagram
Also Read: Sarkaru Vaari Paata: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న కళావతి సాంగ్.. టాలీవుడ్లోనే నెంబర్ వన్ రికార్డ్..
Nithiin: సౌత్ ఇండియాలోనే ఆ విషయంలో ఏకైక హీరోగా నితిన్.. బీటౌన్‌లో క్రేజ్ మాములుగా లేదుగా..
Thyroid: థైరాయిడ్ సమస్యతో ఇబ్బందిపడుతున్నారా ? అయితే ఈ జ్యూస్‌లతో చెక్ పెట్టొచ్చు.. అవెంటంటే..
Viral Photo: చూడగానే మైమరిపించే కళ్లు.. చూస్తూనే ఉండాలనిపించే మోము.. ఎవరో గుర్తించారా..?