AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: పరీక్షలో మెడికల్ స్టూడెంట్ హైటెక్ కాపీ.. వాడి టాలెంట్‌కు ఇన్విజిలేటర్ ఫ్యూజులు ఔట్!

ప్రతీ గ్యాంగ్‌లోనూ బ్యాక్ బెంచర్స్ ఉంటారు. వీళ్లు ఎప్పుడూ చేసేదే ఒకటే.. క్లాస్‌కు డుమ్మా కొట్టామా.! పరీక్షల్లో కాపీ కొట్టి పాస్ అయ్యామా.!

Viral News: పరీక్షలో మెడికల్ స్టూడెంట్ హైటెక్ కాపీ.. వాడి టాలెంట్‌కు ఇన్విజిలేటర్ ఫ్యూజులు ఔట్!
Mass Copying
Ravi Kiran
|

Updated on: Feb 26, 2022 | 9:06 PM

Share

ప్రతీ గ్యాంగ్‌లోనూ బ్యాక్ బెంచర్స్ ఉంటారు. వీళ్లు ఎప్పుడూ చేసేది ఒకటే.. క్లాస్‌కు డుమ్మా కొట్టామా.! పరీక్షల్లో కాపీ కొట్టి పాస్ అయ్యామా.! ఇదే వారికి తెలిసింది. అప్పుడప్పుడూ మనం కూడా కష్టమైన సబ్జెక్ట్ ఏదైనా ఉంటే.. దానిలో పాస్ అయ్యేందుకు పరీక్షల్లో స్లిప్‌లు పెట్టిన రోజులు లేకపోలేదు. సరే.! పెట్టామనుకుందాం.. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానని అనుకుంటున్నారా.! తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ మెడికల్ స్టూడెంట్ పరీక్షలో పాస్ అయ్యేందుకు హైటెక్ కాపీ చేశాడు. అసలు వాడి టాలెంట్‌‌కు ఫ్యూజులు ఎగరాల్సిందే.

అసలు విషయానికొస్తే.. ఇండోర్‌లోని ఎంజీఎం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఓల్డ్ బ్యాచ్‌కు చెందిన ఇద్దరు విద్యార్ధులు మొబైల్స్ ద్వారా మాస్ కాపీయింగ్ చేస్తూ పట్టుబడ్డారు. పరీక్ష జరుగుతున్న సమయంలో ఇన్విజిలేటర్‌కు ఆ ఇద్దరు విద్యార్ధుల తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో ఆరా తీయగా.. విషయం మొత్తం బయటికి వచ్చింది. ఆ ఇద్దరి దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. పట్టుబడిన ఇద్దరు విద్యార్ధుల్లో ఒకడు.. కాపీ కొట్టే విషయం బయటకు తెలియకుండా ఉండేలా మైక్రో బ్లూటూత్ పరికరాన్ని ఏకంగా చెవిలో సర్జరీ ద్వారా అమర్చుకున్నాడట.

మాస్ కాపీయింగ్ బయటపడిందిలా..

పరీక్ష ప్రారంభమైన గంటలోనే ఎగ్జామ్‌ సెంటర్‌కు ఫ్లైయింగ్ స్క్వాడ్ వచ్చింది. వారు పూర్తిగా సెర్చ్ ఆపరేషన్ చేయగా.. ఇద్దరు విద్యార్ధుల ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించింది. వారిలో ఒకడి నుంచి మొబైల్‌ను స్వాధీనం చేసుకున్న స్క్వాడ్.. ఆ ఫోన్‌కు బ్లూటూత్ కనెక్ట్ అయ్యిందని గుర్తించారు. దాని కోసం మొత్తం క్లాసు తనిఖి చేశారు. పట్టుబడిన మరో విద్యార్ధిని కూడా క్షుణ్ణంగా చెక్ చేయగా.. బ్లూటూత్ జాడ ఎక్కడా దొరకలేదు. అరగంట సేపు ఆ ఇద్దరినీ మరోసారి గట్టిగా అడగ్గా.. చివరికి అందులో ఒకడు తన చెవిలో బ్లూటూత్ అమర్చబడిందని నిజం ఒప్పుకున్నాడు. కాగా, ఈ విద్యార్థి గత 11 సంవత్సరాలుగా ఈ పరీక్షను రాస్తూనే ఉన్నాడట… మళ్లీ మళ్లీ ఫెయిల్ అవుతూనే వచ్చాడట. ఇలాంటి తటస్థ పరిస్థితులలో చివరికి ఈ హైటెక్ కాపీకి దిగాడట. అయినా చివరికి ఇలా అడ్డంగా బుక్కయ్యాడు.

Follow Us
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..