AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Katrina Kaif Birthday: మాల్దీవుల్లో మల్లీశ్వరి.. భర్తతో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్ ఇలా ప్లాన్ చేశారు

Katrina Kaif Birthday: విక్టరీ వెంకటేష్ సరసన 'మల్లీశ్వరి' సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. జులై 16న కత్రినా తన బర్త్ డే జరుపుకోనున్నారు.

Katrina Kaif Birthday: మాల్దీవుల్లో మల్లీశ్వరి.. భర్తతో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్ ఇలా ప్లాన్ చేశారు
Katrina Kaif
Janardhan Veluru
|

Updated on: Jul 15, 2022 | 1:49 PM

Share

Katrina Kaif Birthday: బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో కత్రినా కైఫ్ ఒకరు. మోడల్‌గా కెరర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. చాలా తక్కువ టైంలోనే బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ల లిస్టులో స్థానం సంపాదించుకున్నారు. సంపాదించుకోవడమే కాదు.. బాలీవుడ్లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. టాప్‌ మోడల్‌ గా రాణిస్తున్న క్రమంలోనే.. ఖైజాద్ గుస్తాద్ డైరెక్షన్లో ‘భూమ్‌’ సినిమాతో బాలీవుడ్ డెబ్యూ ఇచ్చారు. ఇక ఆ తరువాత విక్టరీ వెంకటేష్ సరసన ‘మల్లీశ్వరి’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ఇక ఆ తరువాత బాలకృష్ణ సినిమా ‘అల్లరి పిడుగు’ తప్ప.. టాలీవుడ్‌లో మరో సినిమా చేయలేదు కత్రినా..!

ఇ క ఆ తరువాత కత్రినా.. బాలీవుడ్‌ పైనేవిక్టరీ వెంకటేష్ సరసన ‘మల్లీశ్వరి’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు.  ఫుల్ ఫోకస్ పెట్టి బీ టౌన్‌లో టాప్‌ స్టార్ అయ్యారు. రీసెంట్ గా హీరో విక్కి కౌశల్‌ ను పెళ్లి చేసుకుని హ్యాపీగా మ్యారీడ్ లైఫ్‌ను లీడ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. తాజాగా ముంబై ఎయిర్ పోర్టులో ప్లాష్ అయ్యారు కత్రినా అండ్ విక్కీ. చేయి చేయి పట్టుకుని మరీ..అన్యూన్యంగా ఎయిర్ పోర్ట్ లోపలికి వెళ్లారు. అయితే జూలై 16న కత్రినా కైఫ్ బర్త్‌ డే. తన భార్య బర్త్‌ డే ను సెలబ్రేట్ చేసేందుకు విక్కీ కత్రినాతో కలిసి మాల్దీవులకు వెళ్లారు. మాల్దీవుల్లో వెకేషన్‌కు వెళ్తూ వారిద్దరూ  ముంబై ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కంటబడ్డారు.  అంతేకాదు.,. మాల్దీవులు తన ఫేవరెట్ స్పాట్ అని కత్రినా ఇంతకు ముందే చెప్పారు. అందుకే కైఫ్ భర్త విక్కీ అదే ప్లేస్‌లో తన భార్య కత్రినా బర్త్‌ డే జరపాలని ఫిక్స్ అయ్యారు.

ఇవి కూడా చదవండి

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో భర్తతో కలిసి కత్రినా..

ఇక జూలై 16తో 39 వ పడిలోకి అడుగుపెడుతున్న కత్రినా.. 1983లో బ్రిటీష్ హాంగ్‌ కాంగ్లో జన్మించారు. ఈమె అమ్మ సుజానే, బ్రిటీష్ లాయర్. నాన్న మహ్మమద్‌ కైఫ్.. కాశ్మీరీ బిజినెస్ మ్యాన్. అయితే చిన్న తనంలోనే అమ్మా- నాన్నలు విడిపోవడంతో.. అమ్మ సుజానే తోనే కత్రినా పెరిగారు. పెరిగే క్రమంలో చాలా దేశాల్లో ఉన్నారు. చివరికి లండన్‌ లో ఉండగానే మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

అలా మోడల్‌గా రాణిస్తున్న క్రమంలోనే.. లండన్ బేస్‌డ్‌ ఫిల్మ్ మేకర్ ఖైజాద్ గుస్తాద్‌ కంట్లో పడ్డారు. అలా భూమ్‌ సినిమాతో ఫిల్మ్ ఛాన్స్ దక్కించుకున్నారు. ఆ సినిమాలో బోల్డ్ గా నటించి బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారారు. ఆ తరువాత సల్మాన్‌ ఖాన్‌తో డేటింగ్‌ చేస్తున్నారని వార్తల్లోకెక్కి.. మేకర్స్ దృష్టిలో పడ్డారు. అక్కడ నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండా బాలీవుడ్లో రాణిస్తూనే ఉన్నారు కత్రినా..!

భర్తతో కలిసి మాల్దీవులకు వెళ్తున్న కత్రినా..

-సతీష్, టీవీ9 తెలుగు డిజిటల్

మరిన్ని సినిమా వార్తలు చదవండి..