AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kangana Ranaut: బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు.. కంగనా రనౌత్‌ సంచలన వ్యాఖ్యలు..

బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ వివాదాల క్వీన్‌ అవుతున్నారు. ఓ వైపు హైకమండ్‌ హెచ్చరికలు .. మరోవైపు ఆమెను చంపేస్తామన్న బెదిరింపులు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. రైతులను బంగ్లాదేశ్‌ ఆందోళనకారుల పోల్చి పెద్ద వివాదంలో ఇరుక్కున్నారు కంగనా . చివరకు అధిష్టానంతో చివాట్లు తిన్నారు..

Kangana Ranaut: బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు.. కంగనా రనౌత్‌ సంచలన వ్యాఖ్యలు..
Kangana Ranaut
Shaik Madar Saheb
|

Updated on: Aug 29, 2024 | 8:40 AM

Share

బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ వివాదాల క్వీన్‌ అవుతున్నారు. ఓ వైపు హైకమండ్‌ హెచ్చరికలు .. మరోవైపు ఆమెను చంపేస్తామన్న బెదిరింపులు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. రైతులను బంగ్లాదేశ్‌ ఆందోళనకారుల పోల్చి పెద్ద వివాదంలో ఇరుక్కున్నారు కంగనా . చివరకు అధిష్టానంతో చివాట్లు తిన్నారు.. మరోవైపు కంగనా ఎమర్జెన్సీ సినిమాపై కూడా వివాదం చెలరేగుతోంది. సినిమా విడుదల పదేపదే వాయిదా పడడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు కంగనా… ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎమర్జెన్సీ సినిమా ధియేటర్లలో విడుదల అవుతుందన్నారు.

ఎమర్జెన్సీ సినిమా రిలీజ్‌కు .. పంజాబ్‌లో తీవ్ర అడ్డంకులు

ఎమర్జెన్సీ సినిమా రిలీజ్‌కు పంజాబ్‌లో తీవ్ర అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్‌ చేయరాదని ఆప్‌ ప్రభుత్వం కోరుతోంది. ఖలిస్తాన్‌ మద్దతుదారులు కూడా ఈ సినిమాకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్‌ విడుదల చేశారు. సినిమాను విడుదల చేస్తే కంగనాను చంపేస్తామని ఖలిస్తాన్‌ వాదులు హెచ్చరికలు జారీ చేశారు.

బెదిరిపులకు భయపడే ప్రసక్తే లేదు

అయితే, బెదిరిపులకు భయపడే ప్రసక్తే లేదంటున్నారు కంగానా.. ఎవరు అడ్డుకుంటారో చూస్తానని కౌంటర్‌ ఇచ్చారు. ఇంత జరుగుతున్నప్పటికి బాలీవుడ్‌ నుంచి తనకు మద్దతు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాలీవుడ్‌లో టాలెంట్‌ ఉన్నవారికి ఎలాంటి గుర్తింపు లభించదని ఆరోపించారు. ప్రోత్సహించే వారు కూడా లేరన్నారు. బాలీవుడ్‌ తనను బాయ్‌కాట్‌ చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు.

ఇవి కూడా చదవండి

బాలీవుడ్‌ నిస్సాహాయ ప్రదేశమని సంచలన వ్యాఖ్యలు చేశారు కంగనా. కొంతమంది సెలబ్రిటీలు ఇతరు టాలెంట్‌ను చూసి అసూయ పడుతారన్నారు. అవాస్తవాలు ప్రచారం చేస్తారన్నారు. కెరీర్‌ను నాశనం చేసేందుకు కుట్రలు చేస్తారని మండిపడ్డారు కంగనా.

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా ఎమర్జెన్సీ సినిమా తీశారు కంగనా.. ఈ సినిమాకు ఆమెనే డైరెక్టర్‌ . ఇందిరాగాంధీ పాత్రను ఆమె పోషించారు. తన సినిమాల్లో యాక్టింగ్‌ చేయరాదని చాలామంది నటులపై ఒత్తడి చేశారని కంగనా ఆరోపించారు.

మరోవైపు, రైతులపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యకర్తలు భారీ ఆందోళన చేపట్టారు. చండీగఢ్‌లో ఆప్‌ కార్యకర్తలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బారికేడ్లను తొలగించేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు , ఆప్‌ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.

రైతులను కంగనా రనౌత్‌ బంగ్లాదేశ్‌ ఆందోళనకారులతో పోల్చడపై ఆప్‌ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కంగనా రనౌత్‌ను వెంటనే బీజేపీ నుంచి బహిష్కరించాలని కోరారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..