Kajol: షారుఖ్‌కు అందుకే పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పలేదు.. కాజోల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

బాలీవుడ్‌లో షారుఖ్‌ఖాన్‌ - కాజోల్‌ జోడీకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'బాజీఘర్‌', 'దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే, ' 'కుచ్‌ కుచ్‌ హోతా హై'

Kajol: షారుఖ్‌కు అందుకే పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పలేదు.. కాజోల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
Basha Shek

|

Nov 04, 2021 | 1:29 PM

బాలీవుడ్‌లో షారుఖ్‌ఖాన్‌ – కాజోల్‌ జోడీకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘బాజీఘర్‌’, ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే, ‘ ‘కుచ్‌ కుచ్‌ హోతా హై’, కభీ ఖుషి కభీ గమ్‌’, ‘మై నేజ్‌ ఈజ్‌ ఖాన్‌’, ‘దిల్‌ వాలే’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో వీరిద్దరూ కలిసి స్ర్కీన్‌ షేర్‌ చేసుకున్నారు. సిల్వర్‌ స్ర్కీన్‌పై రొమాంటిక్‌ జోడీగా పేరు తెచ్చుకున్న షారుఖ్‌- కాజోల్‌ పెళ్లి కూడా చేసుకుంటారని చాలామంది భావించారు. అయితే అలాంటిదేమీ జరగలేదు. షారుక్ గౌరీఖాన్‌ని, కాజోల్ అజయ్‌ దేవ్‌గణ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

అతనికి అంతకన్నా సంతోషమేముంది? ఇటీవల షారుక్‌ తనయుడు ఆర్యన్‌ఖాన్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్టైన సంగతి తెలిసిందే. సుమారు మూడు వారాల పాటు జైలులో గడిపి కొన్ని రోజుల క్రితమే ఇంటికి వచ్చాడు. ఇక మంగళవారం (నవంబర్‌ 2)న బాలీవుడ్‌ బాద్‌షా 56వ వసంతంలోకి అడుగుపెట్టాడు. దీంతో పలువురు ప్రముఖులు అతనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే షారుఖ్‌ హిట్‌ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కాజోల్‌ మాత్రం బర్త్‌ డే విషెస్‌ చెప్పలేదు. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ ఆస్క్‌ మీ ఎనీథింగ్’ సెషన్‌ నిర్వహించిన కాజోల్‌కు ‘షారుఖ్‌కు ఎందుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పలేదు’ అని ప్రశ్నించాడు. దీనికి ‘ షారుఖ్‌ కుమారుడు ఆర్యన్‌ ఇంటికి తిరిగి రావడంతో ఆయన కలలన్నీ ఫలించాయి. ఇంతకన్నా సంతోషకరమైన విషయం ఆయనకు ఇంకేముంటుంది’ అని తనదైన శైలిలో సమాధానమిచ్చిందీ ముద్దుగుమ్మ.

Adipurush : ఆదిపురుష్ సెట్‏లో సంబరాలు చేసుకుంటున్న ప్రభాస్… ఓంరౌత్.. ఎందుకంటే..

Aha 2.O: అంగరంగ వైభవంగా ‘ఆహా 2.0’ మెగా ఈవెంట్.. టాలీవుడ్ తారల సందడి.. అల్లు అర్జున్ అదిరిపోయే ఎంట్రీ.. (ఫొటోస్)

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu