Sushmita Konidela: స్పీడ్ పెంచిన సుష్మిత కొణిదెల.. పండగ రోజున కొత్త ప్రాజెక్టులు వెల్లడించిన మెగాస్టార్‌ కూతురు..

మెగాస్టార్‌ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత గతంలో తండ్రి నటించిన 'ఖైదీ నంబర్‌ 150', 'సైరా నరసింహా రెడ్డి' సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే

Sushmita Konidela:  స్పీడ్ పెంచిన సుష్మిత కొణిదెల.. పండగ రోజున కొత్త ప్రాజెక్టులు వెల్లడించిన మెగాస్టార్‌ కూతురు..
Follow us
Basha Shek

|

Updated on: Nov 04, 2021 | 11:45 AM

మెగాస్టార్‌ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత గతంలో తండ్రి నటించిన ‘ఖైదీ నంబర్‌ 150’, ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత భర్త విష్ణు ప్రసాద్‌తో కలిసి ‘గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌ టైన్‌మెంట్స్‌’ అనే నిర్మాణ సంస్థను స్థాపించి ‘షూటవుట్‌ అట్‌ ఆలేరు’ అనే వెబ్‌ సిరీస్‌ను నిర్మించింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5లో స్ట్రీమింగైన ఈ సిరీస్‌ పాజిటివ్‌ రివ్యూస్‌ అందుకుంది. దీంతో వెండితెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చింది. కొన్ని రోజుల క్రితం నటుడు సంతోష్‌ శోభన్‌ హీరోగా ‘శ్రీదేవి శోభన్‌బాబు’ అనే సినిమాను కూడా ప్రకటించింది. అప్పుడు ఈ సినిమా పోస్టర్‌ను పంచుకున్న ఆమె తాజాగా ఈ ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు వెల్లడించింది. దీంతో పాటు దీపావళి సందర్భంగా తన మరో కొత్త ప్రాజెక్టు వివరాలను కూడా పంచుకుంది.

ఈ సందర్భంగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియో పోస్ట్ చేసిన ఆమె మొదట ‘శ్రీదేవి శోభన్‌ బాబు’ చిత్ర విశేషాలు పంచుకుంది. ఈ సినిమాలో సంతోష్‌ శోభన్‌, గౌరీ కిషన్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. నాగబాబు, రోహిణీ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రశాంత్‌ కుమార్‌ డైరెక్టర్‌గా పరిచయం కానున్నారు. దీంతో పాటు ‘సేనాపతి’ పేరుతో మరో సినిమాను కూడా రూపొందించనుంది సుస్మిత. రాజేంద్ర ప్రసాద్, నరేష్‌ అగస్త్య, హర్షవర్ధన్‌, జీవన్‌ రెడ్డి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గతంలో ‘సావిత్రి’, ‘ప్రేమ ఇష్క్‌ కాదల్‌’ వంటి చిత్రాలను రూపొందించిన పవన్‌ సాదినేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

View this post on Instagram

A post shared by Sushmita (@sushmitakonidela)

Also Read:

Peddanna Twitter Review: పెద్దన్న ట్విట్టర్ రివ్యూ.. రజినీకాంత్ సినిమా పై ఆడియన్స్ ఓపెనియన్..

Allu Arjun & Ram Charan: వెలుగుల దీపావళి.. మెగా – అల్లు కుటుంబాల పండగ సెలబ్రెషన్స్.. ఫోటోస్ వైరల్..

Samantha: టపాసులను బ్యాన్ చేయకండి.. సద్గురు మాటలకు సమంత మద్దతు..