Samantha: టపాసులను బ్యాన్ చేయకండి.. సద్గురు మాటలకు సమంత మద్దతు..

దీపావళి.. దీపాలు.. పూజలు.. మిఠాయిలు పంచుకోవడమే కాదు.. ఎంతో సంబరంగా టపాసులు కాల్చడం కూడా ఆనవాయితీగా

Samantha: టపాసులను బ్యాన్ చేయకండి.. సద్గురు మాటలకు సమంత మద్దతు..
Samantha
Follow us

|

Updated on: Nov 04, 2021 | 11:54 AM

దీపావళి.. దీపాలు.. పూజలు.. మిఠాయిలు పంచుకోవడమే కాదు.. ఎంతో సంబరంగా టపాసులు కాల్చడం కూడా ఆనవాయితీగా వస్తుంది. ఇక దీపావళికి రెండు మూడు రోజుల ముందు నుంచే పిల్లలు టపాసులు కాలుస్తూ పండగ వాతావరణాన్ని సృష్టిస్తారు. అయితే టపాసులను నిషేధించి పర్వావరణాన్ని పరిరక్షించాలనే మాట చాలా సంవత్సరాలుగా వినిపిస్తోంది. బ్యాన్ క్రాకర్స్ అనే నినాదంతో ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే కేవలం నిర్ణిత సమయంలోనే టపాసులు కాల్చాలని కొన్ని చోట్లు నిబంధనలు కూడా విధించడం జరిగింది. అయితే టపాసులను కాల్చడం ఆపాలి అనే విషయంపై ఇషా ఫౌండేషన్ స్థాపకులు.. ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ తనదైన శైలీలో బదులిచ్చారు.

“కొన్నేళ్లుగా నేను టపాసులు కాల్చడం లేదు.. కానీ నా చిన్నప్పుడు ఈ వెలుగుల పండుగ అంటే ఎంతో ప్రత్యేకం. సెప్టెంబర్ నుంచి దీపావళి రోజు టపాసులు పేల్చోచ్చని కలలు కనేవాళ్లం.. పండగ అయిపోయినా సరే .. ఆ టపాసులను దాచుకొని మరో రెండు నెలలు రోజూ కాల్చేవాళ్లం. పర్యావరణ పరంగా చురుగ్గా ఉండే వ్యక్తులెవరూ పిల్లలను క్రాకర్స్ కాల్చకూడదని అనకూడదు.. ఇది మంచి పద్దతి కాదు.. టపాసులు, బాణాసంచా కాల్చే ఆనందాన్ని అనుభవించకుండా ఉండేందుకు వాయు కాలుష్యంపై ఆందోళన ఒక కారణం కాకూడదు. వాయికాలుష్యం పై ఆందోళ చెందుతున్న వారికి నేను ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని సూచిస్తున్నాను. ఈసారికి మీరు టపాసులు కాల్చడం మానేసి.. మీ పిల్లలను కాల్చనివ్వండి. అంతేకాదు.. మీ ఆఫీసుకు కారులో కాకుండా. మూడు రోజులు నడిచి వెళ్లండి..” అంటూ ఓ వీడియోను ట్వీట్ చేశారు.

అయితే సద్గురు మాటలకు సమంత కూడా సంఘీభావం తెలిపింది. సద్గురు మాట్లాడిన మాటలను తన ఇన్‏స్టా స్టోరీల పోస్ట్ చేస్తూ డోంట్ బ్యాన్ క్రాకర్స్ అంటూ కామెంట్ చేసింది.. గత కొద్ది రోజులుగా సమంత సోషల్ మీడియాలో పుల్ యాక్టివ్‏గా ఉంటుంది. తన పర్సనల్ విషయాలతోపాటు.. ప్రస్తుత పరిస్థితులపై స్పందిస్తూ తన అభిప్రాయాలను తెలియజేస్తుంది. అంతేకాకుండా.. ఇటీవల పలు ఆసక్తికర కోట్స్ షేర్ చేస్తూ తన మానసిక పరిస్థితి గురించి తెలియజేస్తున్నట్లుగా అర్థమవుతుంది. ఇక సామ్ ఇప్పుడు తన కెరీర్ పై పూర్తి దృష్టి సారించినట్లుగా టాక్. తన వరకు వచ్చిన ప్రాజెక్ట్స్ అన్నింటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ తిరిగి బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇక సామ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా టాక్.

Also Read: Acharya: నీలాంబరిని తెగ పొగిడేస్తున్న రామ్ చరణ్.. ఆకట్టుకుంటున్న ఆచార్య మెలోడి..

Acharya: నీలాంబరిని తెగ పొగిడేస్తున్న రామ్ చరణ్.. ఆకట్టుకుంటున్న ఆచార్య మెలోడి..

Trisha: అరుదైన రికార్డు సృష్టించిన త్రిష.. ట్విట్టర్‏లలో శుభాకాంక్షల వెల్లువ.. అసలు మ్యాటరేంటంటే..