Jathi Ratnalu Song Released: ‘జాతిరత్నాలు’ నుంచి లిరికల్ సాంగ్ విడుదల.. చిట్టి నా బుల్ బుల్ చిట్టి అంటూ..

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం నటిస్తున్న సినిమా జాతిరత్నాలు. అనుదీప్ కేవీ ఈ చిత్రానికి దర్శకత్వం అందిస్తుండగా.. మహానటి ఫేం డైరెక్టర్ నాగ్ అశ్విన్..

Jathi Ratnalu Song Released: 'జాతిరత్నాలు' నుంచి లిరికల్ సాంగ్ విడుదల.. చిట్టి నా బుల్ బుల్ చిట్టి అంటూ..
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 11, 2021 | 1:41 PM

Jathirathnalu Movie: ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం నటిస్తున్న సినిమా జాతిరత్నాలు. అనుదీప్ కేవీ ఈ చిత్రానికి దర్శకత్వం అందిస్తుండగా.. మహానటి ఫేం డైరెక్టర్ నాగ్ అశ్విన్.. స్వప్న సినిమాస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కామెడీ ఎంటర్ టైనర్‏గా రాబోతున్న ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‏గా నటించింది. ఇందులో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా సంక్రాంతి కానుకగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో చిట్టి సాంగ్‏ను విడుదల చేసింది చిత్రబృందం.

చిట్టి నా బుల్ బుల్ చిట్టి.. అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఎంతగానే ఆకట్టుకుంటుంది. దీనికి రామజోగయ్య శాస్త్రి లిరిసిస్ట్ అందించాడు. సింగర్ రామ్ మిరియాల గాత్రాన్ని అందించాడు. ఇక ఈ సినిమాకు రధన్ సంగీతం అందిస్తుండగా… తర్వలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read:

Kartik Aaryans: ఆ బాలీవుడ్ హీరో రెమ్యూనరేషన్ రోజుకు రెండు కోట్లంట? ఆయన ఎవరో తెలుసా..

Actress RenuDesai: ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు.. రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్..