ఇస్మార్ట్ భామల.. ఇన్‌స్టా ముచ్చట్లు!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమా గతవారం విడుదలై అన్ని కేంద్రాల్లో హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకు ఈ మూవీ తెగ నచ్చేసింది. తెలంగాణ యాసలో రామ్ చెప్పే ప్రతి డైలాగులు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించిన నభా నటేష్, నిధి అగర్వాల్ కూడా తమ నటనకు ప్రశంసలు అందుకుంటున్నారు. మాస్ […]

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమా గతవారం విడుదలై అన్ని కేంద్రాల్లో హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకు ఈ మూవీ తెగ నచ్చేసింది. తెలంగాణ యాసలో రామ్ చెప్పే ప్రతి డైలాగులు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించిన నభా నటేష్, నిధి అగర్వాల్ కూడా తమ నటనకు ప్రశంసలు అందుకుంటున్నారు. మాస్ రోల్‌లో నభా నటేష్ ఇరగదీసిందని.. గ్లామర్‌తో పాటు నటనలోనూ మెప్పించిందని ఫ్యాన్స్ అంటున్నారు. అటు పూరి జగన్నాధ్‌కు గురువైన రామ్ గోపాల్ వర్మ కూడా నభా నటేష్‌ను ‘ఇలియానా 2.0’ అని పొగడ్తలతో ముంచెత్తాడు.
After seeing #issmartshankar ,I have no doubt that @NabhaNatesh is ILEANA 2.0 pic.twitter.com/B3vEz3IbXu
— Ram Gopal Varma (@RGVzoomin) July 21, 2019
ఇక నిధి అగర్వాల్ విషయానికి వస్తే.. అటు గ్లామర్, ఇటు నటనతో మాస్ అభిమానులకు బాగా చేరువైంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో ‘ఇస్మార్ట్ శంకర్’ ఆమెకు మూడో సినిమానే అయినా చాలా ఈజ్‌తో నటించిందని క్రిటిక్స్ అంటున్నారు. పాత మూస పద్దతిలో కాకుండా.. పూరి ఈ సినిమాను తనదైన మార్క్ కథనంతో ఆసక్తికరంగా తెరకెక్కించాడని చెప్పవచ్చు.
మరోవైపు ఈ ఇస్మార్ట్ భామల ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను.. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారట. పూరితో చేసిన ఒక్క సినిమా వల్ల.. ఈ భామలిద్దరూ తెగ పాపులర్ అయిపోయారు.
