‘ఆర్ఆర్ఆర్’ కోసం పెద్ద సాహసం చేస్తోన్న ఎన్టీఆర్..!
టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రం ఈ ఏడాది జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా విషయంలో పక్కా ప్రణాళికను వేసుకోన్న రాజమౌళి.. దాని ప్రకారంగా షూటింగ్‌ను కానిచ్చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 70శాతానికి పైగా ఈ మూవీ షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. కాగా […]
టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రం ఈ ఏడాది జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా విషయంలో పక్కా ప్రణాళికను వేసుకోన్న రాజమౌళి.. దాని ప్రకారంగా షూటింగ్‌ను కానిచ్చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 70శాతానికి పైగా ఈ మూవీ షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది.
కాగా ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే. ఇక వీరిద్దరి పాత్రలను రాజమౌళి అద్భుతంగా తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం ఎన్టీఆర్ పెద్ద సాహసమే చేస్తున్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. మూవీలో ఒక కీలక సన్నివేశంలో ఎన్టీఆర్ గుండు చేయించుకోవాల్సి ఉంటుందట. ఇక ఈ విషయాన్ని ఎన్టీఆర్‌కు చెప్పగా.. వెంటనే అతడు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. డూప్ లేకుండా ఆ సీన్లో తానే నటించేందుకు సిద్ధమయ్యాడట ఎన్టీఆర్. అయితే ఇలాంటి సన్నివేశాల్లో నటించేందుకు సాధారణంగా ఏ స్టార్ హీరో అంత పెద్ద సాహసం చేయడు. కానీ ఎన్టీఆర్ ఒప్పుకోవడం నిజంగా గ్రేట్ అంటున్నారు ఆయన అభిమానులు. ఒకవేళ ఇదే నిజమైతే ఇంతవరకు చేయని పాత్రలో నటించబోతున్నాడు ఈ యంగ్ టైగర్.
కాగా ఈ మూవీలో అలియా భట్, ఒలివియా మోరస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. మల్టీలింగువల్ సినిమాగా రాబోతున్న ఈ మూవీపై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.