‘రెండో పెళ్లి’ ఆలోచనలో దిల్ రాజు..!
టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే.. ఆ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్లు మామూలుగా ఉండవు. అంతేకాదు ఆయన ఏదైనా సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకున్నా.. తెలీకుండానే ఆ మూవీపై అంచనాలు పెరుగుతుంటాయి. కాగా గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకే పరిమితమైన దిల్ రాజు ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేంటంటే.. 49సంవత్సరాలున్న ఈయన రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు టాక్. అనారోగ్యంతో దిల్ రాజు […]
టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే.. ఆ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్లు మామూలుగా ఉండవు. అంతేకాదు ఆయన ఏదైనా సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకున్నా.. తెలీకుండానే ఆ మూవీపై అంచనాలు పెరుగుతుంటాయి. కాగా గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకే పరిమితమైన దిల్ రాజు ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేంటంటే.. 49సంవత్సరాలున్న ఈయన రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు టాక్. అనారోగ్యంతో దిల్ రాజు భార్య అనిత 2017లో కన్నుమూశారు. ఆ బాధ ఆయనను చాలా రోజులే వెంటాడింది. అంతేకాదు భార్య మరణం తరువాత కొన్ని రోజుల పాటు ఆయన డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు సన్నిహితులు చెబుతుంటారు. ఇక ఆ తరువాత బయటకు వచ్చిన ఆయన ఇప్పుడు సినిమాలకే మొత్తం సమయాన్ని కేటాయిస్తూ వస్తున్నారు.
కానీ ఈ వయస్సులో ఆయనకు తోడు అవసరమని చాలామంది దిల్ రాజుకు సూచిస్తున్నారట. మానసికంగానూ దృఢంగా ఉండేందుకు ఒక తోడు అవసరమని సన్నిహితులు దిల్ రాజుకు చెబుతున్నారట. దీంతో మళ్లీ పెళ్లి చేసుకోవాలని దిల్ రాజు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వివాహం చాలా సింపుల‌్‌గా చేసుకోవాలని ఆయన అనుకుంటున్నారట. ఈ క్రమంలో త్వరలోనే దిల్ రాజు రెండో పెళ్లి జరగబోతున్నట్లు టాక్. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా దిల్ రాజుకు ఒక కుమార్తె ఉండగా.. ఆమె ఇటీవల రెండో బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్‌లో వి, సీనయ్య, పింక్ రీమేక్ చిత్రాలు తెరకెక్కుతున్నాయి.