ఉప్పెనలో ‘రాయనమ్‌’గా మక్కల్ సెల్వన్.. కేక పుట్టిస్తోన్న లుక్‌లు..!

మెగాస్టార్ చిరంజీవి మరో మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం ఉప్పెన. బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆయనకు సంబంధించిన రెండు ఫస్ట్‌లుక్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో రాయనమ్ అనే పాత్రలో విజయ్ సేతుపతి కనిపించబోతుండగా.. ఓ లుక్‌లో కారు పక్కన, మరో లుక్‌లో సిగరెట్ తాగుతూ కనిపించారు విజయ్ సేతుపతి. చూస్తుంటే ఆయన పాత్ర […]

ఉప్పెనలో 'రాయనమ్‌'గా మక్కల్ సెల్వన్.. కేక పుట్టిస్తోన్న లుక్‌లు..!
Follow us

| Edited By:

Updated on: Feb 10, 2020 | 7:00 PM

మెగాస్టార్ చిరంజీవి మరో మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం ఉప్పెన. బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆయనకు సంబంధించిన రెండు ఫస్ట్‌లుక్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో రాయనమ్ అనే పాత్రలో విజయ్ సేతుపతి కనిపించబోతుండగా.. ఓ లుక్‌లో కారు పక్కన, మరో లుక్‌లో సిగరెట్ తాగుతూ కనిపించారు విజయ్ సేతుపతి. చూస్తుంటే ఆయన పాత్ర సినిమాకు పెద్ద అస్సెట్‌ అవ్వనున్నట్లు అర్థమవుతోంది.

కాగా ప్రేమ కథాంశంతో ఉప్పెన తెరకెక్కింది. ఇందులో వైష్ణవ్ తేజ్ సరసన క్రితి శెట్టి నటించింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇటీవల వచ్చిన ఉప్పెన ఫస్ట్‌వేవ్ ఆకట్టుకోవడంతో ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఏప్రిల్ 2న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. శంకర్‌దాదా ఎంబీబీఎస్, అందరివాడు చిత్రాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఇదివరకే ప్రేక్షకులకు పరిచయమైన వైష్ణవ్ తేజ్.. ఈ మూవీతో హీరోగా తానేంటో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో