AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taapsee Pannu : స్టార్ హీరోయిన్ పై ఆదాయపన్ను శాఖ దాడులు.. అమ్మడి పై ఐటీ పగపట్టడానికి కారణం అదేనా..?

మహారాష్ట్రలో ఐటీ శాఖ యాక్షన్‌ మొదలుపెట్టింది. పన్ను ఎగవేత ఆరోపణలపై స్టార్ హీరోయిన్‌ తాప్సీ, బాలీవుడ్ డైరెక్టర్లు అనురాగ్‌ కశ్యప్‌, వికాస్‌ బల్‌తో పాటు ప్రొడ్యూసర్‌ మధు మంతెన ఇళ్లలో సోదాలు నిర్వహించింది.

Taapsee Pannu : స్టార్ హీరోయిన్ పై  ఆదాయపన్ను శాఖ దాడులు.. అమ్మడి పై ఐటీ పగపట్టడానికి కారణం అదేనా..?
Rajeev Rayala
|

Updated on: Mar 04, 2021 | 8:27 AM

Share

Income-Tax raids on Taapsee :  మహారాష్ట్రలో ఐటీ శాఖ యాక్షన్‌ మొదలుపెట్టింది. పన్ను ఎగవేత ఆరోపణలపై స్టార్ హీరోయిన్‌ తాప్సీ, బాలీవుడ్ డైరెక్టర్లు అనురాగ్‌ కశ్యప్‌, వికాస్‌ బల్‌తో పాటు ప్రొడ్యూసర్‌ మధు మంతెన ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ముంబై, పుణేలో ఏకకాలంలో 20 నుంచి 22 చోట్ల సోదాలు ఆకస్మిక తనిఖీలు చేపట్టింది ఐటీ శాఖ. ఫాంటమ్ ఫిలింస్‌ ప్రొడక్షన్ కంపెనీతో సంబంధం ఉన్న హైప్రొఫైల్ వ్యక్తుల ఆఫీసులు టార్గెట్‌ చేసి ఈ దాడులు నిర్వహించారు.

దర్శకుడు విక్రమాదిత్య మోత్వానీ,నిర్మాతలు మధు మంతెన, వికాస్ బల్ కలిసి 2011లో ఫాంటమ్‌ ఫిలింస్‌ ప్రొడక్షన్ ప్రారంభించారు. 2018లో ఈ కంపెనీ మూత పడింది. అయితే కంపెనీ ఆదాయ వ్యవహారాలు, ఐటీశాఖకు సమర్పించిన రిటర్న్స్‌లతో తేడాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఈ లెక్కలు తేల్చుందుకే ఈ దాడులు నిర్వహించినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలుపుతుంది.

2010లో ఝుమ్మంది నాదంతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తాప్సీ… ఆ తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. పింక్‌, తప్పడ్‌ సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. సామాజిక అంశాల్లోనూ ఆమె తన గొంతు వినిపించడంలో ముందుంటారు. ఇటీవల రైతు ఉద్యమానికి కూడా పరోక్ష సంఘీభావం ప్రకటించారు. రైతు ఉద్యమానికి అంతర్జాతీయ సెలబ్రిటీల మద్దతును తప్పు పడుతూ పలువురు దేశీ సెలబ్రిటీలు చేసిన ట్వీట్లపై ఆమె విరుచుకుపడ్డారు. పలు అంశాలపై ఘాటుగా ఆమె ట్వీట్‌ చేస్తున్న టైమ్‌లో తాప్సీ నివాసం, కార్యాలయాలపై ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారాయి. ఇటు అనురాగ్ కశ్యప్‌ కూడా ఈ మధ్య రైతుల ఆందోళనకు మద్దతుగా ట్వీట్లు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ట్వీట్లు చేశారనే కోపంతోనే వీరిపై ఐటీ దాడులు చేయించారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. బీజేపీ కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని విమర్శించాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kajal Aggarwal : కవ్విస్తున్న కాజల్.. ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అందాల చందమామ .. ఫిదా అవుతున్న అభిమానులు..

ఆ సమయంలో రియలైజ్ అయి ఆ పాత్రకు ఒప్పుకున్నా.. కానీ అవార్డు తీసుకొస్తుందని అనుకోలేదంటున్న బాలీవుడ్ స్టార్..

భారీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న తెలుగమ్మాయి… ఆ కారణంతోనే ఆ డైరెక్టర్‏కు నో చెప్పిందా ?