భారీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న తెలుగమ్మాయి… ఆ కారణంతోనే ఆ డైరెక్టర్‏కు నో చెప్పిందా ?

'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఈషా.. తనదైన నటనతో పలు సినిమాల్లో నటించింది. ఈ మధ్యకాలంలో

  • Rajitha Chanti
  • Publish Date - 10:19 pm, Wed, 3 March 21
భారీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న తెలుగమ్మాయి... ఆ కారణంతోనే ఆ డైరెక్టర్‏కు నో చెప్పిందా ?

‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఈషా.. తనదైన నటనతో పలు సినిమాల్లో నటించింది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యమ యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్స్‌తో కుర్రకారును ఫిదా చేస్తోంది. ‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో హీరోయిన్‏గా నటించింది వరంగల్ అమ్మాయి ఈషా రెబ్బా. ఆ మూవీ తర్వాత బందిపోటు, అమీ తుమీ వంటి సినిమాల్లో నటించిన.. ఇంతవరకు సరైన బ్రేక్ రాలేదు. ఆ తర్వాత హీరోయిన్‏గా కాకుండా కీలక పాత్రల్లో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. కానీ అమ్మడుకు సోషల్ మీడియాలో మాత్రం ఫాలోయింగ్ ఓ రేంజ్‏లో ఉంది. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన పిట్టకథలు సినిమా నటించింది ఈ బ్యూటీ. తాజాగా ఈ అమ్మడు గురించి ఫిల్మ్ నగర్లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.

డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో హీరోయిన్ సమంత అక్కినేని ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘శాకుంతలం’. పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఈషాను సంప్రదించినట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలో చేయడానికి ఈషా రెబ్బ తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకు ప్రధాన కారణం రెమ్యూనరేషన్ అన్నట్లు సమాచారం. ఇందులో ఈషాకు రెమ్యూనరేషన్ తక్కువగా ఇచ్చేందుకు డైరెక్టర్ ఒప్పుకున్నాడట. దీంతో తక్కువ రెమ్యూనరేషన్ వలన ఈ సినిమా నుంచి ఈషా తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయం గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాను మహాభారతంలోని ఆదిపర్వం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను చూపించనున్నాడు. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ఇందులో శాకుంతల పాత్రలో సమంత కనిపించనుంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందిస్తు్న్నారు.

Also Read:

Shaadi Mubarak Movie Pre Release Event: మొగిలిరేకులు ఫేం సాగర్ హీరోగా ‘షాదీ ముబారక్’. ప్రీరిలీజ్ ఈవెంట్ మీ టీవీ9 లైవ్‏లో…

Actor Prabhas: ముంబైలో సెటిల్ కానున్న ప్రభాస్… ఖరీదైన ఇల్లు కోనుగోలు చేయనున్న రెబల్ స్టార్..