Actor Prabhas: ముంబైలో సెటిల్ కానున్న ప్రభాస్… ఖరీదైన ఇల్లు కోనుగోలు చేయనున్న రెబల్ స్టార్..
దర్శకధీరుడు తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాతో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అప్పటివరకు కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే
దర్శకధీరుడు తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అప్పటివరకు కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే ఫాలోయింగ్ ఉన్న రెబల్ స్టార్ ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. దీంతో అటు బీటౌన్‌లో కూడా వరుస ఆఫర్లను అందుకుంటున్నాడు ఈ హీరో. ప్రస్తుతం రెబల్ స్టార్ చేతిలో నాలుగు పాన్ ఇండియా సినిమాలున్నాయి. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్స్ ప్రారంభంకావడంతో ప్రభాస్ ఫుల్ బీజీగా మారిపోయాడు. ఇక ఇదే క్రమంలో ఆయన ఎక్కువగా ముంబైలోనే గడపాల్సి వస్తుంది. దీంతో ప్రభాస్ ప్రతిసారి హోటళ్ళు, రెంట్ ఫ్లాట్స్‌లలో గడపాల్సి వస్తుంది. తాజాగా ప్రభాస్ ముంబైలో ఓ ఇల్లు కోనాలని భావిస్తున్నాడట. ఇప్పటికే ఇల్లు కోసం వెతుకులాట ప్రారంభించినట్లుగా సమాచారం.
ఇక ప్రభాస్ కెరీర్ గురించి వస్తే.. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ డైరెక్షన్లో ప్రభాస్ ‘ఆదిపురుష్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా.. రావణుడి పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఇక సీతగా కృతిసనన్ కనిపించబోతుంది. వచ్చే ఏడాది ఆగస్టు 11న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇదే కాకుండా కేజీఎఫ్ పేం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ‘సలార్’ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఇటీవలే ఈ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్.. మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇందులో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొణె ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇక టాలీవుడ్ నటీనటులు ఒక్కోక్కరిగా ముంబై బాట పడుతున్నారు. ఇప్పటికే స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా సైతం ముంబైలో ఓ ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
Also Read:
Machu Lakshmi: మరో రికార్డు సృష్టించిన మంచువారమ్మాయి.. దివ్యాంగుల కోసం 100 కిలోమీటర్ల సైక్లింగ్..