- Telugu News Photo Gallery Cinema photos Tollywood actress manchu lakshmi cycles 100 km to raise funds for aditya mehata foundation
Machu Lakshmi: మరో రికార్డు సృష్టించిన మంచువారమ్మాయి.. దివ్యాంగుల కోసం 100 కిలోమీటర్ల సైక్లింగ్..
టాలీవుడ్ సీనియర్ మోహన్ బాబు కుమార్తే మంచు లక్ష్మీ మరోసారి తన మంచి మనసును చాటుకుంది. ఈసారి స్పోర్ట్స్‌లో రాణించాలని ఉన్న పేద దివ్యాంగులకు అండగా నిలబడింది మంచు వారమ్మాయి.
Updated on: Mar 03, 2021 | 5:51 PM

టాలీవుడ్ సీనియర్ మోహన్ బాబు కుమార్తే మంచు లక్ష్మీ మరోసారి తన మంచి మనసును చాటుకుంది. ఈసారి స్పోర్ట్స్‌లో రాణించాలని ఉన్న పేద దివ్యాంగులకు అండగా నిలబడింది మంచు వారమ్మాయి.

క్రీడలపై ఆసక్తి ఉన్న పేద దివ్యాంగులకు ఆదిత్య మెహతా ఫౌండేషన్ అనే సంస్థ శిక్షణ ఇస్తుంది. ఇందులో భాగంగా వారికి నిధులు సేకరించి ఇవ్వాలని మంచు లక్ష్మీ సైకిల్ పై వంద కిలోమీటర్లు పయనించి దాదాపు రూ.5 లక్షల రూపాయాలను ఫౌండేషన్‌కు ఇవ్వాలనుకున్న సంగతి తెలిసిందే.

ఇక గత 20 రోజులుగా చేస్తున్న సైక్లింగ్ ముగిసింది. ఇదిలా ఉండగా.. గతంలో కూడా మంచు లక్ష్మి 35 కిలోమీటర్లు సైక్లింగ్ చేసింది. తాజాగా 100 కిలోమీటర్లు సైక్లింగ్ పూర్తిచేసింది. పారా స్పోర్ట్స్ అకాడమీ రిహాబ్ సెంటర్లోని పారా అథ్లెట్ల కోసం విరాళాలు సేకరించేందుకు మంచు లక్ష్మి ఈ కార్యక్రమం చేసింది.

పారా సైక్లింగ్ జాతీయంగా, అంతర్జాతీయంగా పతకాలను సాధించిన ఆదిత్య మెహతా ఆధ్వర్యంలో ఈ ఫౌండేషన్ నడుస్తుంది. ఈ ఫౌండేషన్ కు గత ఆరేళ్ళుగా సేవలు అందిస్తుంది మంచు లక్ష్మి.

ఈ పౌండేషన్‌కు గత ఆరేళ్లుగా సేవలు అందిస్తూ.. నిధుల సమీకరణలో ఆదిత్య మెహతాకు తోడుగా నిల్చున్నారు మంచు లక్ష్మి.

పారా స్పోర్ట్స్ అకాడమీ రిహాబ్ సెంటర్లోని పారా అథ్లెట్ల కోసం విరాళాలు సేకరించేందుకు మంచు లక్ష్మి ఆదిత్యా మెహతా ఫౌండేషన్ తో కలసి ఈ కార్యక్రమం చేసింది.




