David warner : డేవిడ్ వార్నర్ ఈసారి తలైవాగా మారాడు.. సూపర్ స్టార్ రజనీకాంత్‌ని వదల్లేదుగా..
David warner : ఆసీస్ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్.. అని పిలవడం కన్న.. టిక్‌టాక్ స్టార్ అని పిలుస్తే అందరికి టక్కున గుర్తుకు వస్తుందేమో. ఎందుకంటే.. వార్నర్..
David warner : ఆసీస్ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్.. అని పిలవడం కన్న.. టిక్‌టాక్ స్టార్ అని పిలుస్తే అందరికి టక్కున గుర్తుకు వస్తుందేమో. ఎందుకంటే.. వార్నర్.. చేసే ఫేస్ మార్ఫింగ్ వీడియోలకు అలాంటి క్రేజ్ ఉంది మరి. తెలుగు, తమిళ్, హింది అన్న తేడా లేకుండా.. వీడియోలతో ఎప్పుడూ ఎంటర్‌టైన్ చేస్తుంటాడు వార్నర్. ఇప్పుడు తాజాగా.. రజనీకాంత్ స్టైల్.. ఇరదీశాడు. అంతేకాదు.. తలైవాకు సంబంధించిన పలు సినిమాలోని డైలాగ్‌లను.. కూడా వార్నర్ పలికించాడు.
ఇక బాలీవుడ్ బడా హీరోల నుంచి మొదలు పెడితే.. టాలీవుడ్ వరకు హీరోల మొహాల స్థానంలో తన ఫేస్‌ను సెట్ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్నాడు. రీఫేస్ యాప్ సహాయంతో అమితాబ్, ప్రభాస్, మహేష్‌బాబు, రజనీకాంత్ వంటి హీరోల సన్నివేశాలకు తన మొహాన్ని యాడ్ చేసి పోస్ట్ చేసిన వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. తాజాగా ఈ క్రికెటర్ దళపతి ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాడు. ఇటీవల తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన సినిమా ‘మాస్టర్’ బాక్సాఫీసు దగ్గర సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే.
ఇటీవల వరుసగా తెలుగు హీరోల సినిమాలను రీఫేస్ చేస్తూ వస్తున్న వార్నర్ తాజాగా విజయ్ నటించిన మాస్టర్ సినిమాను రీఫేస్ చేసి.. తన ఇన్ స్టాలో షేర్ చేశాడు. దీంతో వార్నర్‌కు క్రికెట్ ఏమో తెలియదు కానీ ఈ వీడియోల ద్వారా విపరీతమైన ఫాలోయింగ్ వస్తోంది. అంతేకాకుండా ఎంతోమంది తన అభిమానులుగా మారిపోతున్నారు. బుట్టుబొమ్మ నుంచి మొదలుపెడితే ఇప్పటి రజనీ స్టైల్ వరకు అన్ని వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారుతున్నాయి. మొత్తానికి వార్నర్ క్రికెట్ కంటే ఈ సంబరాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నాడు.
View this post on Instagram
కొనసాగుతున్న నెట్‌ఫ్లిక్స్ హవా.. మరో 40 ఒరిజినల్స్ విడుదలకు రంగం సిద్ధం.. ఏ ఏ సనిమాలు ఉన్నాయంటే..
పాల వ్యాపారంతో అదరగొడుతున్న 23 ఏళ్ల కుర్రాడు.. అవి అలాంటి ఇలాంటి పాలు కావు మరీ..! ఏంటో తెలుసా..