“వకీల్ సాబ్” నుంచి మరో లిరికల్ సాంగ్ రిలీజ్.. ఫుల్ ఎనర్జిటిక్‍తో ‘సత్యమేవ జయతే’ అంటూ వస్తున్న పవన్ స్టార్.
Vakeel Saab movie satyameva jayathe song: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీతో వస్తున్న చిత్రం 'వకీల్ సాబ్'. ఈ సినిమాను
Vakeel Saab movie satyameva jayathe song: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీతో వస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. మాస్ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేసి ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, బేవ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక గత కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా రాజకీయాల్లో బీజీగా ఉన్న పవన్.. మళ్లీ వకీల్ సాబ్ సినిమాతో రాబోతుండడంతో అభిమానులు ఈ మూవీ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మగువా మగువా సాంగ్ సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తై పొస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో లిరికల్ సాంగ్ విడుదలైంది.
‘జనజనజన జనగణమున కలగలిసిన జనం మనిషి రా.. ’ అంటూ ప్రారంభమైన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించగా.. శంకర్ మహదేవన్ అద్భుతంగా పాడారు. పృథ్వీ చంద్ర ర్యాప్ పాడారు. థమన్ ఎనర్జిటిక్ బీట్‌తో సంగీతం అందించారు. ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ లో దూసుకుపోతుంది. #vakeelsaab అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో వైరల్ అవుతుంది. ఇదిలా ఉండగా… ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. బాలీవుడ్ హిట్ మూవీ పింక్ కు రీమేక్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో శృతి హాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తిరు డైలాగ్స్ రాశారు. రవివర్మ యాక్షన్ డైరెక్టర్. ప్రస్తుతం పవన్ ‘అయ్యప్పనుమ్ కోషియం’ సినిమా రీమేక్ లో నటిస్తున్నారు. అలాగే సక్సెస్స్ ఫుల్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమ్ చేస్తున్నాడు పవన్.
Also Read: Aranya Movie Trailer Launch Live: రానా ‘అరణ్య’ ట్రైలర్ విడుదల.. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన వీడియో.. .
ఈ పది సెకండ్స్ వీడియో ఏకంగా రూ. 48 కోట్లకు అమ్ముడైంది.. ఎందుకు అంత ధర పలికిందో తెలుసా.!
పాల వ్యాపారంతో అదరగొడుతున్న 23 ఏళ్ల కుర్రాడు.. అవి అలాంటి ఇలాంటి పాలు కావు మరీ..! ఏంటో తెలుసా..