Aranya Movie Trailer Launch Live: రానా ‘అరణ్య’ ట్రైలర్ విడుదల.. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన వీడియో.. .
Rana Daggubati "Aranya" Movie Trailer Launch Live : బహుబలి సినిమాల తర్వాత రానా దగ్గుపాటి నటిస్తున్న చిత్రం ‘అరణ్య’.
Rana Daggubati “Aranya” Movie Trailer Launch Live : బహుబలి సినిమాల తర్వాత రానా దగ్గుపాటి నటిస్తున్న చిత్రం ‘అరణ్య’. ఈ సినిమాను హిందీలో ‘హాథీ మేరే సాథీ’గా రూపొందుతుంది. ప్రభు సాలొమోన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ గతేడాది ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉండగా.. లాక్డౌన్ ప్రభావంతో వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేయోచ్చు అని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పలు సినిమాలను విడుదల చేయడానికి నిర్మాతలు ముందుకు వస్తున్నారు. ఈ సినిమాను మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఆ క్షణం వచ్చేసింది. హైదరాబాద్‌లో ఈరోజు (మార్చి 3) సాయంత్రం అరణ్యం మూవీ ట్రైలర్ లాంచ్ చేసారు చిత్రయూనిట్. ఆ వేడుకను టీవీ9 ఛానల్లో లైవ్‌లో చూడొచ్చు.
తాజాగా విడుదలైన అరణ్య మూవీ ట్రైలర్‌కు విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఈ వీడియోలో రిజర్వ్డ్ ఫారెస్ట్. మనుషులెవరు ఇందులోకి రాకూడదు అంటూ రానా చేప్తున్న డైలాగ్‌తో వీడియో ప్రారంభమయ్యింది. ఇందులో రానాతో కలిసి కొందరు అడవిలో ఏనుగులతో సహవాసం చేస్తున్నారు. అయితే ఓ అటవీ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకరం చేసిన వ్యక్తి ఆ అడవి చుట్టూ గోడ కట్టిస్తాడు. దీంతో ఏనుగులకు నీరు దొరకుండా అవుతుంది. ఇక వాటికి నీటిని అందించేందుకు ఆ గోడను పడగోట్టడానికి రానా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే రానాను ఇంటర్వ్యూ చేస్తున్న అమ్మాయి వాటి గురించి ప్రశ్నలు సందిస్తుంది. దీంతో విసుగెత్తిన రానా ఏనుగుల ఇంట్లో మనుషుల అరాచకం అని హెడ్ లైన్ పెట్టే దమ్ముందా ? అని అడుగుతాడు. ఇక ఈ వీడియో ఆసక్తికరంగా సాగింది. ఇందులో విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియా పిల్గావోంకర్ కీలక పాత్రల్లో నటించారు.
Also Read: