Dhanush: ‘నీ ఫేస్ అలాంటిది’.. డైరెక్టర్ మాటలకి ధనుష్ షాక్
సౌత్ అంటే స్టైల్, బాలీవుడ్ అంటే సబ్‌స్టాన్స్… ఈ రెండింటినీ కలిపి ఒకేసారి పాన్ ఇండియా లెవెల్‌కి తీసుకెళ్లేందుకు రెడీ అయ్యారు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. కోలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు వరుస సినిమాలు చేస్తూ విజయవంతంగా రాణిస్తున్న ధనుష్ ఎంచుకునే ..

సౌత్ అంటే స్టైల్, బాలీవుడ్ అంటే సబ్‌స్టాన్స్… ఈ రెండింటినీ కలిపి ఒకేసారి పాన్ ఇండియా లెవెల్‌కి తీసుకెళ్లేందుకు రెడీ అయ్యారు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. కోలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు వరుస సినిమాలు చేస్తూ విజయవంతంగా రాణిస్తున్న ధనుష్ ఎంచుకునే ప్రతి కథ, పాత్ర అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే… ధనుష్ సినిమాల్లో హీరో ఎక్కువగా ‘లవ్ ఫెయిల్యూర్’ పాత్రల్లోనే కనిపిస్తారు! ఇంతకీ ఈ వింత ఎంపిక వెనుక గల రహస్యం ఏంటో తాజాగా పంచుకున్నారు ధనుష్. ఇంతకీ ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలని మీకూ ఆసక్తిగా ఉందా?
లవ్ ఫెయిల్యూర్ ఫేస్..
కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించే ఎక్కువ సినిమాలు లవ్‌స్టోరీలు, అందులోనూ లవ్ ఫెయిల్యూర్ ఎక్కువగా ఉంటాయి. నిజానికి ఆ పాత్రల్లో ధనుష్ చాలా సహజంగా నటిస్తారు. తాజాగా ఈ కథల ఎంపిక వెనకున్న రహస్యం ఏంటో ఆయనే స్వయంగా పంచుకున్నారు. ధనుష్, కృతిసనన్ జంటగా నటిస్తున్న ‘తేరే ఇష్క్ మేన్’ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రమోషన్స్‌లో డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్, హీరోయిన్ కృతి సనన్‌లతో కలిసి పాల్గొంటున్నారు ధనుష్. గతంలో రాంఝనా (2013), అత్రంగి రే (2021) సినిమాల్లోనూ ధనుష్ లవ్ ఫెయిల్యూర్ పాత్రలే పోషించాడు.
తాజాగా ఈ విషయంపై ధనుష్ మాట్లాడుతూ ‘నేను ఆనంద్‌ని అడిగాను. నన్ను ఇలాంటి కథలకే ఎందుకు పిలుస్తావు అని. కానీ దానికి ఆనంద్ చెప్పిన సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది. నాకు పర్ఫెక్ట్ లవ్ ఫెయిల్యూర్ ఫేస్ ఉంది అన్నారు. కృతి కూడా అవును అవును! అంటూ తల ఊపేసింది. దాంతో ఆరోజు నేను ఇంటికి వెళ్లాక అద్దం ముందు నిల్చుని చూసుకున్నాను. ఏంట్రా ఇది నా ముఖంటో లవ్ ఫెయిల్యూర్ అని రాసి ఉందా ఏంటి? అని ఆలోచించా’ అంటూ తన కథల ఎంపిక రహస్యాన్ని పంచుకున్నారు.
ధనుష్ నటించిన ‘రాంఝానా’లో కుందన్, ‘అత్రంగి రే’లో విక్కీ, ఇప్పుడు ‘తేరే ఇష్క్ మేన్’లో శంకర్… అన్నీ ఒకే తరహా ఎమోషనల్ బ్రోకెన్ లవర్స్! ‘ఈ మాత్రం ముఖం ఉంటే చాలు… ప్రేక్షకులు ఆటోమాటిక్‌గా బాధపడతారు, ఏడుస్తారు, ఫైనల్‌గా క్లాప్స్ కొడతారు!’ అంటూ ధనుష్ తనకు తానే చెప్పుకున్నారట. సాధారణ హ్యాండ్‌సమ్ హీరోల్లా కాకుండా, తన ‘లవ్ ఫెయిల్యూర్ ఫేస్’నే బ్రాండ్‌గా మార్చుకుని పాన్ ఇండియా స్టార్ అయిపోయారు.
కుందన్ వంటి పాత్రలను పోషించడానికి జాగ్రత్త, సమతుల్యత అవసరమని ధనుష్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘రాంఝానా’ మామూలుగానే కనిపిస్తుంది, కానీ పోషించడానికి చాలా క్లిష్టమైన పాత్ర. కొందరు కుందన్‌ను ఇష్టపడకపోవచ్చు కానీ ఆ పాత్ర పోషించడానికి చాలా సాధన, హోంవర్క్ చేశానంటూ లవ్ ఫెయిల్యూర్ పాత్రలు పోషించడం వెనకున్న కష్టాన్ని పంచుకున్నారు ధనుష్. మరి ‘తేరే ఇష్క్ మేన్’లో శంకర్‌గా ఎలా అలరిస్తారో చూడాలి!




