AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తబ్బుబ్బిపోతోన్న నితిన్, రష్మిక.. ఎందుకో తెలుసా..!

టాలీవుడ్ హీరో హీరోయిన్లు నితిన్, రష్మిక తబ్బుబ్బిపోతున్నారు. తన అభిమాన నటుడు చేసిన ట్వీట్‌కు వారు తెగ సంబరపడిపోతోంది. ఈ సందర్భంగా తమ ఆనందాన్ని మొత్తం సోషల్ మీడియాలో వెల్లడించారు నితిన్, రష్మిక. అసలు వారిద్దరు ఎందుకంత సంతోషంగా ఉన్నారంటే..! నితిన్, రష్మిక హీరోహీరోయిన్లుగా ఛలో ఫేమ్ వెంకీ కుడుముల ‘భీష్మ’ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఇటలీలోని పొసిటానోలో జరుగుతోంది. ఇక షూటింగ్‌ గ్యాప్‌లో నితిన్, రష్మిక ఇద్దరు కలిసి […]

తబ్బుబ్బిపోతోన్న నితిన్, రష్మిక.. ఎందుకో తెలుసా..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 29, 2019 | 8:15 AM

Share

టాలీవుడ్ హీరో హీరోయిన్లు నితిన్, రష్మిక తబ్బుబ్బిపోతున్నారు. తన అభిమాన నటుడు చేసిన ట్వీట్‌కు వారు తెగ సంబరపడిపోతోంది. ఈ సందర్భంగా తమ ఆనందాన్ని మొత్తం సోషల్ మీడియాలో వెల్లడించారు నితిన్, రష్మిక. అసలు వారిద్దరు ఎందుకంత సంతోషంగా ఉన్నారంటే..!

నితిన్, రష్మిక హీరోహీరోయిన్లుగా ఛలో ఫేమ్ వెంకీ కుడుముల ‘భీష్మ’ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఇటలీలోని పొసిటానోలో జరుగుతోంది. ఇక షూటింగ్‌ గ్యాప్‌లో నితిన్, రష్మిక ఇద్దరు కలిసి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ‘వార్’ చిత్రంలో ‘గుంగ్రూ’ పాటకు స్టెప్పులు వేశారు. దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న రష్మిక “హృతిక్ రోషన్ సర్ లవ్ యు” అంటూ ట్వీట్ చేసింది. తాజాగా ఈ ట్వీట్‌కు హృతిక్ స్పందించాడు. స్వీట్. థ్యాంక్స్ రష్మిక, నితిన్. మీ భీష్మకు బెస్ట్ విషెస్. లవ్ యు” అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

ఇక దీంతో రష్మిక ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వెంటనే.. “థ్యాంక్యు సర్. మిమ్మల్ని ఏదో రోజు కలిసిప్పుడు .. ఈ డ్యాన్స్‌ను మీతో చేయాలని కోరుకుంటున్నా” అని ట్వీట్ చేసింది. దీనిపై హృతిక్ ఎలా స్పందిస్తాడో చూడాలి. మరోవైపు హృతిక్ చేసిన ట్వీట్‌ను హీరో నితిన్ కూడా స్పందించాడు. “థ్యాంక్యు సో మచ్ సర్. వుయ్ లవ్ యు” అంటూ కామెంట్ పెట్టాడు. కాగా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో వరుస చిత్రాల్లో నటిస్తోన్న రష్మికకు ఆ మధ్యన బాలీవుడ్‌ ఆఫర్ కూడా వచ్చింది. తెలుగులో విజయం సాధించిన జెర్సీ హిందీ రీమేక్‌లో హీరోయిన్ పాత్ర కోసం రష్మికను సంప్రదించారు. షాహిద్ కపూర్ ఈ రీమేక్‌లో నటిస్తుండగా.. దిల్ రాజు, అల్లు అరవింద్, అమన్ గిల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే కొన్ని కారణాల వలన రష్మిక ఈ ఆఫర్‌కు నో చెప్పగా.. ఆ తరువాత ఆ పాత్రకు శ్రద్ధా కపూర్‌ను ఓకే చేసింది చిత్ర యూనిట్.