Vastu Tips: మనీ ప్లాంట్‌తో జాగ్రత్త.. ఈ పని చేశారో దురదృష్టం మీ నట్టింట్లో తిష్ట వేస్తుంది..
వాస్తు శాస్త్రం ప్రకారం.. మనీ ప్లాంట్ ఇంట్లో సానుకూల వాతావరణాన్ని, అదృష్టాన్ని తీసుకొస్తుందని నమ్ముతారు. అయితే, ఈ మొక్కను ఇంట్లో సరైన దిశలో ఉంచడం ఆర్థిక శ్రేయస్సుకి అత్యంత ముఖ్యం. వాస్తు నియమాల ప్రకారం, మనీ ప్లాంట్‌ను ఇంట్లో ఎక్కడ ఉంచాలి..? ఏ దిక్కున ఉంచాలి అనే విషయాలను తెలుసుకుందాం..

వాస్తు శాస్త్రం.. ఎన్నో విషయాల గురించి చెబుతుంది.. ఇళ్లు అలాగే.. కార్యాలయాలలో ఇలా అన్ని చోట్ల ప్రకృతి శక్తులను.. (భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం) సమతుల్యం చేయడం ద్వారా ఆరోగ్యం, సంపద.. ఆనందాన్ని పెంపొందించుకోవచ్చని వాస్తుశాస్త్రం వివరిస్తుంది.. అందుకే.. పురాతన వాస్తు శాస్త్రాన్ని ఇప్పటికీ చాలా మంది విశ్వసిస్తారు. అయితే.. వాస్తుశాస్త్రం మనీ ప్లాంట్ మొక్క విషయంలో కూడా పలు విషయాలను వివరిస్తుంది.. అది ఎక్కడ నాటాలి.. ఏ దిక్కున ఉంచాలి.. అనే వాటిని కచ్చితంగా పాటించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం, మనీ ప్లాంట్ ఇంట్లో సానుకూల వాతావరణాన్ని, అదృష్టాన్ని తీసుకొస్తుందని విస్తృతంగా నమ్ముతారు. అయితే, ఈ మొక్కను ఇంట్లో సరైన దిశలో ఉంచడం ఆర్థిక శ్రేయస్సుకి అత్యంత ముఖ్యం.. వాస్తు నియమాల ప్రకారం, మనీ ప్లాంట్‌ను ఇంట్లోని ఆగ్నేయ దిశలో ఉంచడం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ దిశ విఘ్నేశ్వరుడికి ఇష్టమైనదిగా చెబుతారు. ఇక్కడ మొక్కను ఉంచడం వల్ల ఇంట్లో అదృష్టం, శుభాలు కలుగుతాయని నమ్ముతారు.
దీనికి విరుద్ధంగా, మనీ ప్లాంట్‌ను ఈశాన్య దిశలో ఉంచడం వల్ల ఆర్థిక నష్టాలు, ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడతాయి. అలాగే.. ఇంట్లో వారు అనారోగ్యాల బారిన పడతారని వాస్తు నిపుణులు సూచిస్తారు. వాస్తు దోషాలు కలగకుండా, మొక్క ఎండిపోకుండా చూసుకోవాలి. ఎండిపోయిన లేదా పసుపు రంగులోకి మారిన ఆకులను వెంటనే తొలగించాలి. మొక్క తీగలు నేలను తాకకుండా చూసుకోవడం కూడా ప్రధానం.. ఎందుకంటే ఇది లక్ష్మీదేవి అభివ్యక్తిగా పరిగణిస్తారు. మనీ ప్లాంట్‌ను ఇంట్లో లోపలే ఉంచాలి.. ఎందుకంటే బయట ఎండకు త్వరగా ఎండిపోయి ఆర్థిక ఇబ్బందులకు దారితీయవచ్చు.
మనీ ప్లాంట్‌ను ఇతరులకు బహుమతిగా ఇవ్వొచ్చా..?
వాస్తు ప్రకారం మనీ ప్లాంట్లను ఇతరులకు ఇవ్వకూడదు. ఒకవేళ అలా ఇస్తే శుక్ర గ్రహానికి కోపం వస్తుందని నమ్ముతారు. శుక్రుడు సంపద, శ్రేయస్సుకు దేవత కాబట్టి, ఈ మొక్కను ఇతరులకు ఇస్తే బహుమతులను లాగేసుకుంటాడని విశ్వసిస్తారు. మన సంస్కృతిలో వాస్తు శాస్త్రానికి అధిక ప్రాధాన్యత ఉంది. దిశ బాగుంటే దశ తిరుగుతుందని భావిస్తారు. ఆర్థిక పురోగతి ఇంటి తూర్పు, ఈశాన్య దిశలపై ఆధారపడి ఉంటుంది. ఈ దిశల్లో ఏదైనా వాస్తు దోషం ఉంటే ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కోవచ్చు లేదా తీవ్రమైన సంక్షోభంలోకి కూరుకుపోవచ్చు. అందుకే మనీ ప్లాంట్ ను సరైన దిశలో, సరైన పద్ధతిలో నిర్వహించడం అత్యవసరం.
అయితే.. కొంతమంది పూల కుండీలను ఈ దిక్కులో ఉంచుతారు.. ఇది కూడా మంచిది కాదు. మనీ ప్లాంట్‌ను కుండీలో లేదా సీసాల్లో నీళ్లు నింపి అందులో పెట్టుకోవాలి. దీంతో ఇంట్లోని ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందట. మనీ ప్లాంట్‌కు రోజు కొంత నీరు పోయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని పరిసరాల్లో అనుకూలమైన శక్తి ఆవహిస్తుంది.
(ఈ వార్తలోని సమాచారం వాస్తుశాస్త్రం, మత సంబంధమైన అంశాల ప్రకారం.. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది.)
