దాదాపు వంద కోట్లతో రెండు అపార్ట్‌మెంట్లు కొన్న హృతిక్‌..!

బాలీవుడ్‌లో హయ్యెస్ట్‌ రెమ్యునరేషన్‌ తీసుకునే హీరోలలో హృతిక్ రోషన్ ఒకరు. అటు సినిమాల పరంగానే కాకుండా వాణిజ్యపరంగానూ హృతిక్‌కి మంచి డిమాండ్ ఉంది.

  • Tv9 Telugu
  • Publish Date - 12:38 pm, Sun, 25 October 20
దాదాపు వంద కోట్లతో రెండు అపార్ట్‌మెంట్లు కొన్న హృతిక్‌..!

Hrithik Roshan Apartments: బాలీవుడ్‌లో హయ్యెస్ట్‌ రెమ్యునరేషన్‌ తీసుకునే హీరోలలో హృతిక్ రోషన్ ఒకరు. అటు సినిమాల పరంగానే కాకుండా వాణిజ్యపరంగానూ హృతిక్‌కి మంచి డిమాండ్ ఉంది. ఇలా రెండు చేతులతో బాగానే సంపాదిస్తున్న హృతిక్‌.. ఇప్పుడు బారీ డబ్బుతో రెండు అపార్ట్‌మెంట్‌లను కొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముంబయిలోని జుహు-వెస్రోవా రోడ్‌లోని ఓ భవనంలో రెండు అపార్ట్‌మెంట్‌లు కొన్నట్లు సమాచారం.

ఇందులో ఒక అపార్ట్‌మెంట్‌కి డూప్లెక్స్‌తో పాటు పెంట్‌ హౌజ్ ఉందని, మరొకటి సింగిల్‌ అపార్ట్‌మెంట్ అని సమాచారం. ఇక ఆ ఫ్లాట్‌లలో నుంచి అరేబియా సముద్రం కనిపిస్తుందని.. అలాగే బిల్డింగ్ పైన 10 కార్లు పార్క్ చేసుకునేందుకు సదుపాయం ఉందని సమాచారం. దాదాపు 38వేల స్క్వేర్‌ ఫీట్ ఉండే ఈ అపార్ట్‌మెంట్ల కోసం హృతిక్ రూ.97.50కోట్లు పెట్టినట్లు సమాచారం. దీనికి సంబంధించిన డీల్‌ గత వారంలోనే పూర్తైనట్లు సమాచారం. కాగా లాక్‌డౌన్‌ సమయం నుంచే హృతిక్‌ అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలలో సముద్రం కనిపిస్తుండగా.. ఈ అపార్ట్‌మెంట్‌లలో తనకు నచ్చినట్లుగా హృతిక్‌ మరిన్ని మార్పులు చేయించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు తన పిల్లల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయించుకున్నట్లు సమాచారం.

Read More:

నటుడిగా రాఘవేంద్రరావు.. జోడీ కట్టబోతున్న ఆ ముగ్గురు హీరోయిన్లు..!

గీతం కట్టడాల కూల్చివేతపై హైకోర్టు స్టేటస్‌ కో ఆదేశాలు