ఆ విషయంలో మహేష్‌ను అనిల్ ఎలా ఒప్పించాడబ్బా..!
ఏ విషయంలోనైనా స్టార్ హీరోలను ఒప్పించడం దర్శకులకు అంత ఈజీ కాదు. ముఖ్యంగా కొన్ని విషయాల్లో హీరోలపై ఒత్తిడి తెచ్చేందుకు దర్శకులు సైతం సాహసం చేయరు. అలాంటిది మహేష్ విషయంలో అనిల్ పెద్ద సాహసమే చేశాడు. సాధారణంగా యాక్షన్, సెంటిమెంట్, డైలాగ్‌లు.. ఇలా ఏ విషయంలో మహేష్‌పై ఏ దర్శకుడు ఒత్తిడి తీసుకురారు. కానీ డ్యాన్స్‌ల విషయంలో మిగిలిన హీరోలతో పోలిస్తే మహేష్ కాస్త వెనుకనే ఉంటారు. అందుకే ఆయనతో పనిచేసిన దర్శకులు సైతం డ్యాన్స్ విషయంలో […]

ఏ విషయంలోనైనా స్టార్ హీరోలను ఒప్పించడం దర్శకులకు అంత ఈజీ కాదు. ముఖ్యంగా కొన్ని విషయాల్లో హీరోలపై ఒత్తిడి తెచ్చేందుకు దర్శకులు సైతం సాహసం చేయరు. అలాంటిది మహేష్ విషయంలో అనిల్ పెద్ద సాహసమే చేశాడు. సాధారణంగా యాక్షన్, సెంటిమెంట్, డైలాగ్‌లు.. ఇలా ఏ విషయంలో మహేష్‌పై ఏ దర్శకుడు ఒత్తిడి తీసుకురారు. కానీ డ్యాన్స్‌ల విషయంలో మిగిలిన హీరోలతో పోలిస్తే మహేష్ కాస్త వెనుకనే ఉంటారు. అందుకే ఆయనతో పనిచేసిన దర్శకులు సైతం డ్యాన్స్ విషయంలో మహేష్‌పై పెద్దగా ఫోర్స్ పెట్టరు. ఇక డ్యాన్స్ విషయంలో గతంలో మహేష్ చేసిన కొన్ని ప్రయోగాలపై ట్రోలింగ్ కూడా జరిగింది. దీంతో చిన్న చిన్న స్టెప్పులతోనే సరిపెట్టుకుంటూ వస్తున్నారు ఈ హీరో. అయితే ఈ విషయంలో అనిల్ రావిపూడి మహేష్‌ను పట్టుబట్టాడట.
మహేష్ ప్రధానపాత్రలో అనిల్ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వరు’ను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉండగా.. అందులో ఒకటి మిలిటరీ ఆంథమ్, రెండు స్పెషల్ సాంగ్‌లు, ఒక ఫ్యామిలీ సాంగ్ మరొకటి మహేష్‌ను టీజ్ చేసే పాట. ఇందులో స్పెషల్ సాంగ్‌లైన ‘మైండ్ బ్లాక్’, ‘డాంగ్ డాంగ్’ పాటలకు మంచి డ్యాన్స్ స్టెప్పులను కంపోజ్ చేశారు కొరియోగ్రాఫర్లు. అయితే డ్యాన్స్ అంటే మహేష్ పెద్దగా ఆసక్తిని చూపకపోగా.. అనిల్ రావిపూడి మాత్రం చేయాల్సిందేనంటూ మహేష్‌ను పట్టుబట్టారట. అంతేకాదు మహేష్‌కు ఇబ్బంది లేకుండా కొరియోగ్రాఫర్లతో ఈజీ స్టెప్పులు కూడా చేయించాడట. ఇక అవి మహేష్‌కు కూడా నచ్చడంతో.. అతడి నుంచి తనకు కావాల్సిన డ్యాన్స్‌ను తెప్పించుకున్నాడట అనిల్. ఇంకా చెప్పాలంటే డ్యాన్స్ విషయంలో మహేష్‌కు అనిల్ కొత్త కాన్ఫిడెన్స్‌ను ఇచ్చినట్లు సమాచారం . ఇక ఈ సినిమాలో మహేష్ ఎలా డ్యాన్స్ చేశాడు అన్న దానికి చిన్న ఉదాహరణ డాంగ్ డాంగ్ ప్రోమోలో ఆల్రెడీ ప్రేక్షకులు చూసేశారు. ఇక మొత్తం పాటల్లో మహేష్.. తన స్టెప్పులతో అభిమానులను అలరిస్తాడన్నది ఫిలింనగర్‌లో టాక్. మరి ఇంతకు మహేష్ డ్యాన్స్‌లు ఎలా ఉండబోతున్నాయో చూడాలంటే మరో పది రోజులు ఆగాల్సిందే.
కాగా సరిలేరు నీకెవ్వరులో మహేష్.. ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించనున్నారు. అతడి సరసన రష్మిక మందన్న నటించగా.. విజయశాంతి, ప్రకాష్ రాజ్, సంగీత తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 5న హైదరాబాద్‌లో జరగనుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.