చిన్మయి తల్లి సంచలన వ్యాఖ్యలు.. సారీ చెప్పిన సింగర్
సింగర్ చిన్మయి తల్లి పద్మహాసిని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. దేవదాసి వ్యవస్థపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవదాసి వ్యవస్థ అన్నది చాలా గొప్పదని.. దాన్ని కూల్చివేసిన హేతువాది పెరియర్‌ను తాను ఎప్పటికీ క్షమించనని ఆమె కామెంట్లు చేశారు. దీంతో నెటిజన్లు ఆమెపై ఫైర్ అయ్యారు. ఇక ఈ వివాదాన్ని చిన్మయికి కూడా ఆపాదించారు. వీరిద్దరికి వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో చిన్మయి రంగంలోకి దిగింది. మొదట […]

సింగర్ చిన్మయి తల్లి పద్మహాసిని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. దేవదాసి వ్యవస్థపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవదాసి వ్యవస్థ అన్నది చాలా గొప్పదని.. దాన్ని కూల్చివేసిన హేతువాది పెరియర్‌ను తాను ఎప్పటికీ క్షమించనని ఆమె కామెంట్లు చేశారు. దీంతో నెటిజన్లు ఆమెపై ఫైర్ అయ్యారు. ఇక ఈ వివాదాన్ని చిన్మయికి కూడా ఆపాదించారు. వీరిద్దరికి వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో చిన్మయి రంగంలోకి దిగింది. మొదట నా తల్లి వ్యాఖ్యలకు నాది బాధ్యత కాదంటూ చెప్పిన చిన్మయి.. ఎట్టకేలకు క్షమాపణ చెప్పారు.
‘‘నా తల్లి మాటలకు నేను బాధ్యత వహించలేను. ఆమె వ్యాఖ్యలను మీరు వ్యతిరేకించాలనుకుంటే వ్యతిరేకించండి. ఆమెకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది. తన ఉద్దేశాలను నేను తప్పుపట్టను’’ అని రాసుకొచ్చింది. అయితే ఆ తరువాత మరో ట్వీట్ చేస్తూ అందులో తన తల్లి వ్యాఖ్యలపై క్షమాపణలు కోరారు. ఇక దేవదాసి వ్యవస్థను పూర్తిగా వ్యతిరేకించనని, అలాగని తన తల్లి వ్యాఖ్యలకు మద్దతు కూడా ఇవ్వనని ఆమె చెప్పుకొచ్చింది. మరి ఈ వివాదం ఇప్పటికైనా సద్దుమణుగుతుందేమో చూడాలి.
I am not responsible for my mother’s actions. If you disagree with her disagree with her, please do. She is capable of speaking for herself.
I dont defend her views or support. https://t.co/lAYBMzkLaC
— Chinmayi Sripaada (@Chinmayi) December 30, 2019
అయితే చిన్మయి వివాదంలో చిక్కుకోవడం ఇది తొలిసారేం కాదు. మీటూ పేరిట జరిగిన ఉద్యమంలో ఆమె పలువురి ప్రముఖుల పేర్లను బయటికి చెప్పారు. ముఖ్యంగా కోలీవుడ్ ప్రముఖ రచయిత వైరముత్తుపై చిన్మయి సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి వయస్సున్న ఆయన తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో కోలీవుడ్ డబ్బింగ్ అసోషియేషన్ ఆమెపై వేటు కూడా వేసింది. ఆ తరువాత కూడా మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై ఆమె పోరాటం చేస్తూ వస్తున్నారు. కానీ తన వరకు వచ్చినప్పుడు ఒకలా.. ఇంకొకరి విషయంలో చిన్మయి మరోలా స్పందిస్తారని నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉంటారు.



