కుక్క హెయిర్ డై కోసం లక్షలు ఖర్చు.. మోడల్‏ను ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

సెలబ్రెటీలు.. మోడల్స్ ప్రతి కదలికలపై అభిమానులు ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. తమ అభిమాన హీరో హీరోయిన్స్

కుక్క హెయిర్ డై కోసం లక్షలు ఖర్చు.. మోడల్‏ను ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..
Viral News

సెలబ్రెటీలు.. మోడల్స్ ప్రతి కదలికలపై అభిమానులు ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. తమ అభిమాన హీరో హీరోయిన్స్ గురించి పూర్తిగా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. గతంలో సెలబ్రెటీల గురించి అభిమానులకు అంతగా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రతి విషయాన్ని ప్రపంచం మొత్తం తెలుసుకుంటోంది. ఇక సోషల్ మీడియాను సెలబ్రెటీస్ కూడా ఎక్కువగా వాడేస్తుంటారు. తమ పర్సనల్ విషయాలను.. ఫోటోలను…వీడియోలను ఎప్పటికప్పుడూ నెట్టింట్లో షేర్ చేస్తూ అభిమానులకు టచ్‏లో ఉంటారు. అయితే కొన్ని సార్లు వారు చేసే పోస్ట్స్ నచ్చితే వారికి ఆకాశానికి ఎత్తేస్తారు నెటిజన్స్. అది కాస్త బెడిసికొట్టినా.. ట్రోల్స్ చేసి‏ ఇంటర్నేట్‏లో ఆడుకుంటారు. సెలబ్రెటీలు చేసే పని నెటిజన్స్‏కు ఆగ్రహం తెప్పిస్తే ఇక అంతే సంగతులు.. తాజాగా ఓ మోడల్‏ చేసిన పనికి నెటిజన్స్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా… సెలబ్రెటీలకు జంతువులను పెంచుకోవడమంటే చాలా ఇష్టం. ఎక్కువగా కుక్కలను, పిల్లులను పెంచుకుంటూ వాటిని తమ ఇంటి సభ్యులుగా ట్రీట్ చేస్తారు. వాటి కోసం ఎంత ఖర్చు చేయడానికైనా ఆలోచించరు. తాజాగా రష్యాకు చెందిన ప్లేబాయ్ మోడల్ అన్నా స్టూపక్ తన పెంపుడు కుక్కకు ఫోటో షూట్ చేయాలనుకుంది. ఇందుకోసం తన కుక్క పిల్ల కలర్ మార్చేసింది. అందుకోసం తన కుక్క పిల్ల ఒంటిమీదున్న వెంట్రుకలకు డై చేయించింది. ఇందుకు ఏకంగా రూ. 5వేల యూరోలు అంటే దాదాపు 5 లక్షలు ఖర్చు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా సదరు మోడల్ తన సోషల్ మీడియా ఖాతాలో చెప్పుకోచ్చింది. ఇంకేముంది మోడల్ చేసిన పనికి ఆమెపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఫోటో షూట్ పేరుతో జంతువులను హింసించడం ఏంటని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ ఇంటి భవనంలో మంటలు.. రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది..

Laal Singh Chaddha: అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా నుంచి స్పెషల్ అప్డేట్.. నాగచైతన్య మూవీ రిలీజ్ ఎప్పుడంటే..

Naga Babu: చంద్రబాబు కంటతడి పెట్టడంపై స్పందించిన మెగా బ్రదర్‌.. అసెంబ్లీ పరిణామాలపై సీరియస్ కామెంట్స్..

Click on your DTH Provider to Add TV9 Telugu