Oscar Awards 2023: రెడ్ కార్పెట్ కాదు.. ఈసారి రంగు మారింది.. ఆస్కార్ వేడుకల్లో ప్రత్యేకతలివే..

అతిథులకు స్వాగతం పలికే రెడ్ కార్పెట్ ఇప్పుడు రంగు మార్చుకుంది. పేరుకు మాత్రమే రెడ్ కార్పెట్ కానీ ఈసారి కనిపించేది మాత్రం షాంపైన్. ఇక మరిన్ని స్పెషాలిటీస్ ఏంటో చూద్దాం..

Oscar Awards 2023: రెడ్ కార్పెట్ కాదు.. ఈసారి రంగు మారింది.. ఆస్కార్ వేడుకల్లో ప్రత్యేకతలివే..
Oscar Award, Red Carpet
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 12, 2023 | 11:59 AM

ఆస్కార్.. ఆస్కార్.. ఆస్కార్.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పేరు మారుమోగుతుంది. ప్రపంచమంతా ఈ అవార్డ్స్ వేడుకల కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల చూపు మొత్తం ఆస్కార్ మీదే ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ వేదికపై గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ ఛాయిస్, హాలీవుడ్ ఫిలిం క్రిటిక్ ఛాయిస్ అవార్డ్స్ అందుకుని సత్తా చాటిన ట్రిపుల్ ఆర్.. ఇప్పుడు సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ కోసం పోటి పడుతుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి ఆస్కార్ అందుకోవాలని తెలుగు ప్రేక్షకులకు కోరుకుంటున్నారు. ఎలాగైనా ఆస్కార్ మాకు రావాలంటూ దేవుడికి మొక్కుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు సినీ ప్రియులు. ఇక ఈసారి ఆస్కార్ అవార్డ్స్ ప్రధానోత్సవ వేడుకలలో చాలా ప్రత్యేకతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అతిథులకు స్వాగతం పలికే రెడ్ కార్పెట్ ఇప్పుడు రంగు మార్చుకుంది. పేరుకు మాత్రమే రెడ్ కార్పెట్ కానీ ఈసారి కనిపించేది మాత్రం షాంపైన్. ఇక మరిన్ని స్పెషాలిటీస్ ఏంటో చూద్దాం..

ఈసారి ఆస్కార్ లో ప్రత్యేకతలు చాలానే వున్నాయి.. ఈ ఆస్కార్ లో జిమ్మీ కిమ్మెల్ మూడవసారి హోస్ట్ గా చేస్తున్నాడు. కానీ అతను స్టేజి మీదకి రాకముందే వాలెట్ హబ్ దగ్గర బిగ్ డ్యాన్స్ ఏర్పాటు చేసారు నిర్వాహకులు. ఇక ఆస్కార్ ఖర్చు మొత్తం 56. 6 మిలియన్ డాలర్స్ అవుతుందట. ఈ ఖర్చులో ముఖ్యంగా A list నటి రెడ్ కార్పెట్ దగ్గర వేసుకునే డ్రెస్ ఖర్చు 10 మిలియన్ డాలర్స్ వుంటుందట. ఇప్పటివరకు రెడ్ కార్పెట్‍లో అత్యంత ఖరీదైన లుక్ లో కనిపించింది లేడీ గాగా , ఆమె 2019 లో ఆమె మెడలో ధరించిన పసుపు రంగు 128 క్యారెట్ డైమండ్ ఖరీదు 30 మిల్లియన్ డాలర్స్ ఇదే ఇప్పటివరకు రికార్డు.

ఆయితే ఈసారి రెడ్ కార్పెట్ పేరుకు మాత్రమే కార్పెట్ రంగు మాత్రం రెడ్ కాదు “షాంపైన్” కలర్ గా మార్చేశారు. 961 తర్వాత మొదటిసారి కార్పెట్ కలర్ ని ఈసారి మారుస్తున్నారు. ఈ కార్పెట్ 50 000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది దీని ధర 24 వేల 700 డాలర్స్ అంట. ఇది మొత్తం ఇంస్టాల్ చేయడానికి 600 గంటలు సమయం పట్టింది అని చెప్తున్నారు. ఒకవేల ఆస్కార్ ఈవెంట్ లో ప్రకటన ఇవ్వాలి అనుకునేవాళ్ళకి 30 సెకన్లకు 2 మిలియన్ డాలర్స్ పే చేయాల్సి ఉంటుందంట.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
గోవా వైన్ షాప్‌లో బన్నీ.! వీడియో చూపించి లాక్‌ చేసిన బాలయ్య..
గోవా వైన్ షాప్‌లో బన్నీ.! వీడియో చూపించి లాక్‌ చేసిన బాలయ్య..
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!
జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి..
జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి..
దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??
దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??
కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు
ఇంటి పనుల్లో బిజీగా కుటుంబ సభ్యులు.. ఇంతలో ఊహించని సీన్‌ !!
ఇంటి పనుల్లో బిజీగా కుటుంబ సభ్యులు.. ఇంతలో ఊహించని సీన్‌ !!
మేఘాల్లో కలిసిపోతున్న మైక్రోప్లాస్టిక్స్‌ !!
మేఘాల్లో కలిసిపోతున్న మైక్రోప్లాస్టిక్స్‌ !!
చలనం లేకుండా పుట్టిన శిశువు.. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా !!
చలనం లేకుండా పుట్టిన శిశువు.. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా !!