AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Billboard Music Awards: బిల్‏బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్‏లో తళుక్కుమన్న ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్..

లాస్ ఏంజెల్స్‏లో బిల్‏బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్‏ ఆదివారం రాత్రి అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్

Billboard Music Awards: బిల్‏బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్‏లో తళుక్కుమన్న ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్..
Priyanka Chopra Nick Jonas
Rajitha Chanti
|

Updated on: May 24, 2021 | 9:56 AM

Share

లాస్ ఏంజెల్స్‏లో బిల్‏బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్‏ ఆదివారం రాత్రి అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్ ముఖ్య అతిధులుగా హజరయ్యారు. ఈ వేడుకలను నిక్ జోనాస్ హోస్ట్ గా వ్యవహరించారు. ఈ అవార్డ్స్ ప్రధానోత్సవంలో ప్రియాంక బంగారు వర్ణపు డ్రెస్ ధరించగా… నిక్ గ్రీన్ సూట్ ధరించారు. ఈ వేడుకలలో నిక్ సోదురులు సైతం పాల్గోన్నారు. గతేడాది నిక్ బ్రదర్స్ టాప్ బిల్/ గ్రూపుతో సహా మూడు బిల్‏బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్ అందుకున్నారు. అలాగే అదే వేడుకలలో వీరు ముగ్గురు సింగింగ్ ప్రదర్శన కూడా ఇచ్చారు. బిల్‏బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్‏ రెడ్ కార్పెట్ పై ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ కెమెరాలకు ఫోజులిచ్చారు.

ఇదిలా ఉంటే.. ఇటివలే నిక్ జోనాస్ ఓ ప్రముఖ రియాల్టీ షోలో పాల్గోన్న సమయంలో ప్రమాదానికి గురయ్యారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స అనంతరం అదే రోజు ఇంటికి చేరుకున్నారు నిక్. ఇక బిల్‏బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్ ప్రదానోత్సవంకు హాజరైన నిక్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని.. సెట్ తగిలిన గాయాలు పెద్దవేం కాదని చెప్పారు. ఈ అవార్డ్స్ ప్రదానోత్సవంకు తను హోస్ట్ గా చేయడమనేది చాలా సంతోషంగా ఉందని తెలిపారు. 2021 బిల్‏బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్ విజేతలను ఆదివారం ప్రకటించారు.

ట్వీట్స్..

Also Read: డాక్టర్లు దేవుళ్ళు కాదు.. వారిలో రాక్షసులు కూడా ఉన్నారు.. వారే నా తండ్రిని చంపేశారు.. ఎవరిని వదలను.. నటి ఆవేదన..

కరోనా బాధితుల సేవలో సెలబ్రెటీలు.. వంద ఆక్సిజన్ బెడ్స్ అందించిన సింగర్ స్మిత.. ఇదంతా వారివల్లే సాధ్యమంటూ ట్వీట్

కోయంబత్తూరులో కరోనా దేవి విగ్రహం.. అచ్చం ఆ నటి మాదిరిగానే ఉందంటున్న నెటిజన్స్.. మీమ్స్ హల్‏చల్..