Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Leonardo DiCaprio: కేరళ సైనికుడిపై ప్రశంసలు కురిపించిన టైటానిక్ హీరో.. రీజన్ ఏంటంటే..

టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో ఒక కేరళకు చెందిన సోల్జర్ గురించి ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేశాడు. ఆయనను ప్రశంసిస్తూ పొగడ్తల వర్షం కురిపించారు. మరి హాలీవుడ్ హీరో కేరళ సైనికుడిని ఎందుకు ప్రశంసించారు? దీనికి కారణం ఏంటి? ఇంట్రస్టింగ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. గత కొన్ని సంవత్సరాల క్రితం కేరళకు చెందిన అబ్రహం అనే యువకుడికి ఒక వింత చేప కనిపించింది.

Leonardo DiCaprio: కేరళ సైనికుడిపై ప్రశంసలు కురిపించిన టైటానిక్ హీరో.. రీజన్ ఏంటంటే..
Leonardo Dicaprio
Follow us
Lakshmi Praneetha Perugu

| Edited By: Shiva Prajapati

Updated on: Jul 25, 2023 | 8:55 PM

టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో ఒక కేరళకు చెందిన సోల్జర్ గురించి ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేశాడు. ఆయనను ప్రశంసిస్తూ పొగడ్తల వర్షం కురిపించారు. మరి హాలీవుడ్ హీరో కేరళ సైనికుడిని ఎందుకు ప్రశంసించారు? దీనికి కారణం ఏంటి? ఇంట్రస్టింగ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. గత కొన్ని సంవత్సరాల క్రితం కేరళకు చెందిన అబ్రహం అనే యువకుడికి ఒక వింత చేప కనిపించింది. అతడు స్నానం చేస్తున్న క్రమంలో ఈ వింత చేప తోక ఉపోతు అతడికి కనిపించిది. తోక కదులుతూ ఉండటంతో అనుమానం వచ్చిన అబ్రహం స్థానిక కుఫు (కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్) ప్రొఫెసర్‌కు సమాచారం ఇచ్చాడు. తర్వాతి కొన్ని వారాల్లో వాళ్ళు అబ్రహం ఇంటికి వచ్చి బావితో పాటు వాటర్ ట్యాంకర్‌ని చూశారు. అదే జాతికి చెందిన మరో నాలుగు చేపలను వారు గుర్తించారు. దీనికి పాతాళ ఈల్ లోచ్‌గా అభివర్ణించారు. పాదాల కింద తిరుగుతుంది కాబట్టి దీనికి సంస్కృత పదం పాతాళ పేరు వచ్చేలాగా చేశారు. సాధారణంగా చేపలు నదులు, సరస్సులు లేదా ఇతర జలాల్లో మాత్రమే నివసిస్తాయి. అయితే ఈ చేప మాత్రం భూగర్భ జలాల్లో నివసించే చేపల సమూహానికి చెందినది. ఇటువంటి చేపలు భారతదేశంలో దాదాపు 17 నుండి 18 రకాలు ఉంటాయి. ఇది కేవలం భారతదేశం, చైనా, మెక్సికో వంటి ప్రదేశాల్లో మాత్రమే కనిపిస్తాయి.

కేరళలోని కుపూస్ రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చిన ప్రాజెక్టు కింద అధ్యయనం చేయడం ప్రారంభించింది. 2015లో మొదటిసారి భూగర్భ జలాల్లో నివసించే చేపల గురించి కనుగొన్నారు. ఇటువంటి చేపలపై అవగాహన కోసం సిటిజన్ సైన్స్ నెటర్క్‌ను యూనివర్సిటీ ప్రారంభించింది. ఇటువంటి వింత చేపలు ఎక్కడైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా కేరళ వాసులకు యూనివర్సిటీ తరఫున అవగాహన కల్పించారు.

ఇవి కూడా చదవండి

కేరళ సోల్జర్‌పై టైటానిక్ హీరో ప్రశంస..

పాతాళ ఈల్ లొచ్ రంగురంగుల చిత్రాలను తన ఇంస్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో. వీటిని కనుగొన్న కేరళ వ్యక్తి అబ్రహంను ప్రశంసిస్తూ ఇన్‌స్టాగ్రమ్‌ లో పోస్ట్ చేశాడు. ‘అడవి మన చుట్టూనే ఉంటుంది. కొన్నిసార్లు ఒక కొత్త జాతిని కనుగొనే రోజులు కూడా వస్తాయి. కేరళ అబ్రహం అదే చేశాడు’ అంటూ క్యాప్షన్ పెట్టాడు.

ఆనందంలో అబ్రహం కుటుంబం..

లియోనార్డో ట్వీట్ చేయడంపై అబ్రహం కుటుంబీకులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు. ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం అబ్రహం వీటిని కనుగొన్నాడు. ఇప్పుడు లియోనార్డో దీనిని గుర్తు చేస్తూ ట్వీట్ చేయడంతో మళ్ళీ పాతాళ ఈల్ లోచ్ పై నెటిజన్స్ సెర్చ్ చేస్తున్నారు.