సినిమా హిట్టు.. హీరోయిన్ ఫట్టు.!

మజిలీ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది దివ్యంశ కౌశిక్. ఈ ముంబై భామ తన స్క్రీన్ ప్రెజెన్స్, నటనతో ప్రేక్షకులను ఫిదా చేసినా.. సినిమాలో హీరోయిన్ క్రెడిట్ మొత్తం సమంతాకే వెళ్ళిపోయింది. దీంతో దివ్యంశకు రావాల్సిన స్థాయిలో పేరు రాకపోవడంతో ప్రస్తుతం ఆమె చెంతకు ఆఫర్స్ రావట్లేదు. మజిలీ చిత్ర యూనిట్ అందరూ కూడా తమ తరువాత సినిమాపై దృష్టి పెడితే.. పాపం ఈ భామ మాత్రం సినిమా ఆఫర్స్ కోసం ఇంకా ఎదురుచూస్తోంది. మొత్తానికి […]

  • Ravi Kiran
  • Publish Date - 1:06 pm, Sun, 5 May 19
సినిమా హిట్టు.. హీరోయిన్ ఫట్టు.!

మజిలీ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది దివ్యంశ కౌశిక్. ఈ ముంబై భామ తన స్క్రీన్ ప్రెజెన్స్, నటనతో ప్రేక్షకులను ఫిదా చేసినా.. సినిమాలో హీరోయిన్ క్రెడిట్ మొత్తం సమంతాకే వెళ్ళిపోయింది. దీంతో దివ్యంశకు రావాల్సిన స్థాయిలో పేరు రాకపోవడంతో ప్రస్తుతం ఆమె చెంతకు ఆఫర్స్ రావట్లేదు.

మజిలీ చిత్ర యూనిట్ అందరూ కూడా తమ తరువాత సినిమాపై దృష్టి పెడితే.. పాపం ఈ భామ మాత్రం సినిమా ఆఫర్స్ కోసం ఇంకా ఎదురుచూస్తోంది. మొత్తానికి దివ్యంశ పరిస్థితి.. సినిమా హిట్.. హీరోయిన్ ప్లాప్ మాదిరి తయారైంది.

ఒకపక్క సరైన హిట్ లేని నిధి అగర్వాల్ లాంటి హీరోయిన్లు మంచి ఆఫర్స్ పట్టుకుంటుంటే.. హిట్ సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసి కూడా దివ్యంశ కౌశిక్ ఖాళీగా కూర్చోవాల్సి వస్తోంది. మరోవైపు ఆమె ఎక్స్ పోజింగ్ చేసే అవకాశం లేకపోవడంతోనే ఆఫర్స్ రావట్లేదని కొందరు.. అదృష్టం కలిసి రాలేదని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా మళ్ళీ హీరో నాగ చైతన్య గానీ, దర్శకుడు శివ నిర్వాణ గానీ తమ తరువాత సినిమాల్లో ఛాన్స్‌లు ఇస్తారేమో చూడాలి.